ఇప్పటికే వివిధ క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణ చికిత్సకు ఉపయోగపడే కొత్త విషయాలను గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలోనూ డాక్టర్లకు సైతం తెలియని కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు ప్రో స్టేట్ క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి అని అందరూ అనుకుంటుండగా అది ఒకటి కాదు రెండు రకాలుగా ఉంటుందని ఏఐతేల్చింది ఆక్స్ఫర్డ్ వర్సిటీ మంచిస్టర్ వర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ అంగుళా సైంటిస్టులు కలిసి పాన్ ప్రెస్టేజ్ క్యాన్సర్ గ్రూప్ పేరుతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేశారు స్టడీలో భాగంగా 9 దేశాలలోని 159 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ పేషంట్ల నుంచి హ్యూమర్ శాంపిల్స్ సేకరించారు ఈ శాంపిల్స్ లోని డిఎన్ఎలో జరిగిన మార్పులను అధ్యయనం చేశారు అలాగే వీటి జీనోమ్ టెస్టుల డేటాను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కూడా స్టడీ చేశారు దీంతో నిజానికి జన్యుపరంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రెండు వేర్వేరు సబ్ టైప్స్ గా ఉందని ఏఐ విశ్లేషించింది ఈ ఫలితాలతో భవిష్యత్తులో ప్రోస్టేట్ క్యాన్సర్ రకాన్ని కచ్చితంగా గుర్తించడంతోపాటు వ్యాధి రకాన్ని బట్టి పేషెంట్లకు బట్టి ప్రత్యేకమైన చికిత్సలు చేసేందుకు వీలవుతుందని రీసర్చ్ చేర్లు తెలిపారు సెల్ జినోమిక్స్ జర్నల్ వీరి అధ్యయనాన్ని ప్రచురించింది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
2, మార్చి 2024, శనివారం
ఎండలో బయటకు వెళ్తున్నారా
రోజురోజుకు పెరుగుతున్న ఎండలలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు ఆ జాగ్రత్తలు ఇవే
సమయానికి ఆహారం తీసుకోవాలి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి ఎండలో ఉద్యోగాలకు ఆటలకు వెళ్లే వారైతే మరో లీటర్ అదనంగా తీసుకోవాలి. అంటే చెమట రూపంలో శరీరం శరీరం నుంచి బయటకు పోయే నీటిని తిరిగి శరీరానికి అందించాలన్నమాట దానివల్ల హైడ్రేషన్ సాధారణ స్థాయిలో ఉంటుంది బయటకు వెళ్లేవారు నల్ల కళ్ళద్దాలు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. పదులైన కాటన్ దుస్తులు తరించాలి టైట్ గా ఉండే జీన్స్ పాలిస్టర్ లాంటి దుస్తులకు సాధ్యమైనంత వరకు వేసవిలో దూరంగా ఉంటే మేలు అలాగే చాలామంది ఎండలో నుంచి ఇంటికి రాగానే స్నానం చేయడం లేదంటే చల్లనిల్లతో ముఖం కడుక్కోవడం ఫ్రిజ్లో నుంచి నీళ్లు తీసుకుని తాగడం చేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి అలా కాకుండా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలో మార్పు వస్తే శరీరం దానిని తట్టుకోలేదు తలనొప్పి జ్వరం గొంతులో మంట లాంటి సమస్యలు వస్తాయి బలహీనంగా సున్నితంగా ఉన్నవారికైతే ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం ఉంచుకోవచ్చు కనుక ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు రెండు మూడు నిమిషాలు విశ్రాంతినివ్వాలి ఆ తర్వాతనే నీళ్లు తాగడం గాని ముఖం కడుక్కోవడం కానీ చేయాలి అదేవిధంగా గంటల తరబడి ఏసీలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లడం కూడా సమస్యలను తెచ్చుకోవడమే క్రమంగా వేసిన తగ్గించుకొని కాసేపు ఏ బాల్కనీలో ఉండి అప్పుడు బయటకు వెళ్లాలి
ఆధ్యాత్మిక వార్తలు మార్చి 2 2024
రేపు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రకాష్ తెలిపారు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వచ్చిన భక్తుల కోసం అన్నదానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సూచించారు
వైభవంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవము
మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి నవగ్రహ పూజ అమ్మవారికి ప్రత్యేక మహాభిషేకము కుంకుమ పూజ పేద పండితుల మంత్రోచ్ఛారణలతో యాగం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
బిచ్కుందలో స్థానిక రంగర్ గల్లీలోని మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యాలు సమర్పించారు అనంతరం అన్నదానం చేశారు
శివరాత్రి వేడుకలకు ఆహ్వానము తాండూరు గ్రామంలోని సుప్రసిద్ధ త్రిలింగ రామేశ్వర ఆలయంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ గార్లను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు ఎంపీపీ రాజదాసు సొసైటీ చైర్మన్ ఆర్కిడి గంగారెడ్డి సభ్యులు రమేష్ సాయిలు రాజశేఖర్ తదితరులు ఉన్నారు
తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు నాయకులు సాయికిరణ్ పోచిగుండా యోగేశ్వర రాజు తదితరులు ఉన్నారు
మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామ శివారులోని పటేల్ చెరువు మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం బోనాలు నిర్వహించారు పట్టు వస్త్రాలు పూలదండలు నైవేద్యాలు సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు
బారడి పోచమ్మ పండుగ చించోలిలో శుక్రవారం భారతి పోచమ్మ పండుగను గ్రామస్తులు నిర్వహించారు స్థానిక హనుమాన్ ఆలయం నుంచి మహిళలు బోనాలు మంగళహారతులతో ఊరేగింపు చేపట్టారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు


