బిచ్కుంద మండల కేంద్రంలో సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థానమఠం ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శ్రీ గణపతి అన్నపూర్ణాదేవి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రెండు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు గురువారం సంపూర్ణమయ్యాయి చివరి రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సద్గురు సోమయ్యప్ప స్వామి సిద్ధగయ శివాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగాయి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
హైదరాబాదులో మన యాత్రి యాప్ ప్రారంభం
హైదరాబాదులో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ మన యాత్రిని గురువారం టీ హబ్లో ప్రారంభించారు డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకున్నది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో భాగమైన ఈ యాప్ను బెంగళూరులోని నమ్మయాత్ర సాధించిన స్ఫూర్తితో టీ హబ్లో రూపొందించారు ఈ సందర్భంగా ఓఎన్టీసీ సీఈవో టి కోషి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి ఇక్కడ సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని తెలిపారు ఇది సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు జస్ట్ పే సంస్థలు చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఎంఎస్ శాన్ మాట్లాడుతూ మనయాత్రి అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని ఇది హైదరాబాదు డ్రైవర్లు పౌరుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్యమం అని తెలిపారు మనయాత్ర ఇప్పటికే హైదరాబాదులో 25 వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకున్నదని తెలిపారు మరో లక్ష మందిని రాబోయే మూడు నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కష్టమైస్ చేసేందుకు టీ హబ్ తో కలిసి పని చేస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు వివరాలకు www.naamyatri.in సంప్రదించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులు డ్రైవర్ల యూనియన్ల సభ్యులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు
ఈట్ రైట్ స్టేషన్లుగా హైదరాబాద్ విశాఖ
భారతదేశపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో 150 రైల్వే స్టేషనులకు ఈట్ రైట్ ట్యాగ్ను అందించింది విస్తారమైన రైల్వే నెట్వర్క్ లో ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకమైన ఆహార ఎంపికలను నిర్ధారించే చొరవలో భాగంగా ఈ గుర్తింపును ప్రకటించింది గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈట్ రైట్ స్టేషన్ ధ్రువీకరణ ప్రక్రియలో ఆహార విక్రతల కఠినమైన ఆడిట్లు ఫుడ్ హ్యాండర్లకు శిక్షణ ఖచ్చితమైన పరిశుభ్రత పారిశుద్ధ్య ప్రోటోకాళ్ళకు కట్టుబడి ఉండడం సమాచారంతో కూడిన ఆహార ఎంపికలపై అవగాహన పెంచే ప్రయత్నాలు ఉంటాయి. ఈ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే స్టేషన్లకు ఈట్ రైటర్ స్టేషన్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది న్యూఢిల్లీ వారణాసి కోల్కతా ఉజ్జయిని అయోధ్య కాంట్ హైదరాబాద్ చండీగఢ్ కొంజికోడ్ గౌహతి విశాఖపట్నం భువనేశ్వర్ వడోదర మైసూర్ సిటీ భూపాల్ లోని రైల్వే స్టేషన్లు ఈట్ రైట్ స్టేషన్ లో జాబితాలో ముందున్నాయి అలాగే ఈగత్పురి ఢిల్లీలోని ఆనంద విహార టెర్మినార్ చెన్నైలోని పురచితలైవర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లకు కూడా ఈ గుర్తింపు లభించింది కూడా ఈ ట్యాగ్లోకి చేరాయి ఈ ట్రేడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి వీటిలో నోయిడా సెక్టార్ 51 ఎస్ప్లనేడ్ కోల్కతా కాన్పూర్ బొటానికల్ గార్డెన్ నోయిడా నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి ఈ చొరవ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రైల్వే స్టేషన్లో ఆహార విక్రయిదారులను కూడా శక్తివంతం చేస్తుంది ఆహార భద్రత పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా వారు విశ్వసనీయతను పొందుతారు ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తారు చివరికి వారి విశ్వ జీవనోపాధిని పెంచుతారు అని ఈ ప్రకటన పేర్కొంది
ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్న హైదరాబాద్ విశాఖపట్నం స్టేషన్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈట్రైట్ స్టేషన్ ధృవపత్రం అందజేసింది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 స్టేషన్లకు ఈ విధంగా ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపింది ఈట్ రైట్ స్టేషన్గా విజయనగరం శ్రీకాకుళం స్టేషన్లు కూడా గుర్తింపు పొందాయి


