28, ఫిబ్రవరి 2024, బుధవారం

60 లలో జ్ఞాపకశక్తికి

 60 ఏళ్లు దాటాక చాలామందికి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంటుంది అలాంటి వాళ్ళకి మల్టీ విటమిన్ మాత్రలు చాలా మేలు చేస్తాయట అవి వాడని వాళ్ళ కన్నా వాడే వాళ్ళ మెదడు వయసు రెండేళ్లు తగ్గుతుందట అమెరికాలోని మాస్ బ్రిగాం హాస్పిటల్ కి చెందిన డాక్టర్ చిరాకు వ్యాస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని నిరూపించింది 60 ఏళ్లు దాటిన సుమారు 21,000 మందితో రెండేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు ఇందులో పాల్గొన్న వాళ్ళని రెండు బృందాలుగా విభజించారు ఒక బృందానికి విటమిన్ లని మరొక బృందానికి విటమిన్ లేని మామూలు చప్పరించే బిడ్డలని ప్లాసిబు ఇచ్చారట రెండేళ్ల పాటు వాడాక వాళ్ళకి వివిధ సమస్యల ఇచ్చి పరీక్షిస్తే తర్కం ప్రణాళికలు వేయడం తదితరు అన్ని అంశాల్లోనూ రెండు బృందాలు సమానంగానే సామర్థ్యం చూపాయట కానీ జ్ఞాపకశక్తి విషయంలో మాత్రం విటమిన్స్ తీసుకున్న వాళ్లు మిగతా వాళ్ళ కన్నా ఎన్నో రెట్లు పై చేయి సాధించడం చూశారట కాబట్టి వైద్యుల సూచన మేరకు సీనియర్ సిటిజన్లో వీటిని తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు

ఆ తల్లి పేరు దగ్గులవ్వ

 భక్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలు ఉంటారని మనకు తెలిసిందే వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్ చేయించే విశాఖ వినాయకుడి దాకా అలా మనకు చాలా గుడులు పేరుొందాయి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అందులో కొలువైన దేవత పేరు దగ్గులవ్వ పేరుకు తగినట్లే ఎటువంటి దగ్గు సమస్యలనైనా పోగుడుతుంది అన్నది భక్తుల విశ్వాసం బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాలనీలో ఉండే ఈ గ్రామ దేవత ఆలయం అతి ప్రాచీనమైనదని అంటారు జలుబు నుంచి నిమోనియా దాకా ఏ సమస్య కారణంగా దగ్గు వచ్చిన ఈ తల్లికి మొక్కుకుంటారు పక్కనే ఉన్న పెన్గంగా నదినీటితో ఈ దేవతని అభిషేకించి దానిని దగ్గు తీర్చే తీర్థంగా తీసుకుంటారు వైద్యంతో అనారోగ్యం తగ్గాక అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఆషాడంలోనూ పెద్ద ఎత్తున పండగ చేస్తారు బోనాలు ఎత్తుతారు ఈ ఆలయంలో ఈ మధ్య కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైభవంగా ప్రాణ ప్రతిష్ట చేశారు



చర్మానికి ఆయుర్వేదము

 వేసవి అయినా చలికాలం అయినా పొడిబారిన చర్మం అయిన జిడోడే శరీరమైన చర్మం ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అందుకు ఆయుర్వేదంలో ఉత్తమ ఉపాయాలు ఉన్నాయి అవి ఏమిటంటే

దాడి మాది ఘ్రుతం.. దాడిని అంటే దానిమ్మ, ఘ్రుతం అంటే నెయ్యి. ఆవు నెయ్యి దానిమ్మ గింజలతో చేసే ఈ ఔషధాన్ని సేవిస్తే కనుక అందులోని విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్ల వలన చర్మం మృదువుగా మారుతుంది

ఆయుర్వేద టీ తులసివేపాకు ఉసిరి పసుపు లాంటి ఔషధ వనరుల మిశ్రమంతో చేసిన పొడిని మరిగించి వడగట్టాలి ఈ తేనీరు తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది

ఫేస్ మాస్క్.. మందార గులాబీ చందనం మంచిష్ట పసుపు కుంకుమపువ్వు లాంటి పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

కుంకుమపువ్వు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ చర్మం యవ్వనంగా ఉండేందుకు సహాయపడితే కెరోటి నాయుడు ఒంటిమిది మచ్చలు తొలగించి చర్మపు కాంతి పెరిగేలా చేస్తాయి