21, ఫిబ్రవరి 2024, బుధవారం

మైసమ్మ ఆలయంలో భక్తుల సందడి

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారంలో కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 దోమకొండలో మంగళవారం జరిగిన నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో స్థానిక జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో జెడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు గోసంకి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరే గోపాల్ రెడ్డి గోసంగి సంఘం బాధ్యులు తదితరులు ఉన్నారు



ఆలయానికి విరాళం

 కామారెడ్డి విశ్వనాథేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దువ్వల సత్యనారాయణ 25 వేల ఒక వంద16 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి 6 7 8 తేదీలలో విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం ఉన్నట్లు కమిటీ భక్తులు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని విశ్వనాథేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి