21, ఫిబ్రవరి 2024, బుధవారం

గర్గుల్లో గుడి నిర్మాణం

 కామారెడ్డి మండలం గర్గుల్ ఎస్సీ కాలనీలోని లండ ఎల్లమ్మ గుడిని మూడున్నర లక్షల రూపాయలతో మాజీ సర్పంచ్ చింతల రవి తేజ గౌడ్ తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చాడు ఈ సందర్భంగా అంబేద్కర్ మాదిగ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ రాజా గౌడ్ పెద్దరాజా గౌడ్ సురేష్ గౌడ్త  తదితరులు పాల్గొన్నారు

23న జిల్లా స్థాయి అథెలిటిక్స్ ఎంపికలు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో ఈనెల 23న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జైపాల్ రెడ్డి అనిల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అండర్ 14 16 18 బాలబాలికల విభాగాలలో 400 మీటర్ల పరువు పందెం నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు త్వరలో హైదరాబాద్లో నిర్వహించే 400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్  పాల్గొంటారని తెలిపారు ఆసక్తి గల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవీకరణ పత్రంతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు

కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం 2024

 సిఐటియు అనుబంధం ఉన్న మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  రాజన్నరసు 

ప్రధాన కార్యదర్శిగా -  ప్రభాకర్ 

వర్కింగ్ ప్రెసిడెంట్గా  - ఎల్ శంకర్

ఉపాధ్యక్షుడిగా - జనార్ధన్ ,గంగాధర్, ఎస్ నాగరాజు, రాజు కృష్ణ,

 కోశాధికారిగా - కుమ్మరి నర్సింలు

 జాయింట్ సెక్రటరీగా - అబ్బాస్ ,మీసాల రవి, భూలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు 

గౌరవ అధ్యక్షుడిగా - చంద్రశేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.