31, జనవరి 2024, బుధవారం

రగ్బీ పోటీలకుచిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక

 కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని శాంతినికేతన్ విద్యాలయ పాఠశాల విద్యార్థులు నలుగురు యాదాద్రి భువనగిరిలో నిర్వహించబోయే రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల విద్యార్థులు రిషిక దివ్య అభిలాష్ రిషిత గౌడ్లు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి రాజు శివాజీ ఉన్నారు



హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం ఏర్పాటు

 హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం 2024 ఏర్పాటు

తాడ్వాయి మండల కేంద్రంలో హనుమాన్ శబరిమాత పండరీనాథ్ మహారాజ్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మద్దిమహేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆకిటి రాజిరెడ్డి కోశాధికారిగా అంబీర్ శ్యామ్ రావు ప్రధాన కార్యదర్శిగా వాంకోజి శ్యామ్ రావు తదితరులను ఎన్నుకున్నారు సర్పంచ్ సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు బీడీసీ చైర్మన్ రాజు గ్రామ పెద్దలు సాయి రెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామి రెడ్డి ఉన్నారు.



సదరం క్యాంపుల తేదీలు ఖరారు

 కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం ఫిబ్రవరి మార్చి నెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 7 8 21 22 తేదీలతో పాటు మార్చిలో ఆరు ఏడు 20 21 తేదీలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన వారు మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.