4, ఫిబ్రవరి 2026, బుధవారం

మోకాలి నొప్పికి ముక్కు సహాయం

 మోకాలి నొప్పులు తగ్గడానికి ముక్కు తోడు పడుతుందా? మోకాలికి ,ముక్కుకు ముడి పెట్టడం ఏమిటి? అని పెదవి విరవకండి .యూనివర్సిటీ ఆఫ్ బెసల్ పరిశోధకులు నిజంగా అలాంటి ఘనతనే సాధించారు. ముక్కు దూలం కణాలతో మృదులాస్తిని వృద్ధిచేసి కీళ్లలో అమర్చే విధానాన్ని రూపొందించారు . కీళ్లు వరుసుకుపోకుండా   చూసే మృదురాస్తి మిగతా కణజాలాల వలె దానంతట అదే కుదురుకోదు .అందుకే దీర్ఘకాలం మోకాలి నొప్పులు బాధపెడుతుంటాయి .వీటి నుంచి బయటపడటానికి బేసిల్ యూనివర్సిటీ చేసిన కొత్త ప్రయత్నం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇందులో రోగి ముక్కులోని మృదులాస్తి నుంచి కొంత నమూనాన్ని తీస్తారు. దీని కణాలను ప్రయోగశాలలో వృద్ధిచేసి మృదువైన పీచుతో కూడిన  చట్రం లో కూర్చుతా రు. అప్పుడు అవి కొత్త  మృదులాస్తి కణజాలంగా వృద్ధి చెందుతాయి .ఇది అవసరమైనంత సైజు ఆకారానికి చేరుకున్నాక దెబ్బతిన్న మోకాలి కీళ్లలో అమరుస్తారు.

పర్ఫెక్ట్ క్యాటరింగ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కామారెడ్డి

 పర్ఫెక్ట్ క్యాటరింగ్ సర్వీసెస్, 

హౌసింగ్ బోర్డ్ కాలనీ,

 కామారెడ్డి..


అన్ని రకాల పండుగలకు ,ఫంక్షన్లకు ,పెళ్లిళ్లకు రుచికరమైన ఆహారం సప్లై చేయబడును.

100 నుండి 5వేల మంది వరకు సభ్యులు పాల్గొని కార్యక్రమాలకు కూడా మేము సప్లై చేయగలము.

కాంటాక్ట్..9666287828,9346877277




వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.