మోకాలి నొప్పులు తగ్గడానికి ముక్కు తోడు పడుతుందా? మోకాలికి ,ముక్కుకు ముడి పెట్టడం ఏమిటి? అని పెదవి విరవకండి .యూనివర్సిటీ ఆఫ్ బెసల్ పరిశోధకులు నిజంగా అలాంటి ఘనతనే సాధించారు. ముక్కు దూలం కణాలతో మృదులాస్తిని వృద్ధిచేసి కీళ్లలో అమర్చే విధానాన్ని రూపొందించారు . కీళ్లు వరుసుకుపోకుండా చూసే మృదురాస్తి మిగతా కణజాలాల వలె దానంతట అదే కుదురుకోదు .అందుకే దీర్ఘకాలం మోకాలి నొప్పులు బాధపెడుతుంటాయి .వీటి నుంచి బయటపడటానికి బేసిల్ యూనివర్సిటీ చేసిన కొత్త ప్రయత్నం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇందులో రోగి ముక్కులోని మృదులాస్తి నుంచి కొంత నమూనాన్ని తీస్తారు. దీని కణాలను ప్రయోగశాలలో వృద్ధిచేసి మృదువైన పీచుతో కూడిన చట్రం లో కూర్చుతా రు. అప్పుడు అవి కొత్త మృదులాస్తి కణజాలంగా వృద్ధి చెందుతాయి .ఇది అవసరమైనంత సైజు ఆకారానికి చేరుకున్నాక దెబ్బతిన్న మోకాలి కీళ్లలో అమరుస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి