29, మార్చి 2024, శుక్రవారం

అరిటాకులో భోజనం ఎందుకు చేయాలి

 అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు రోజు కుదరకపోయినా కనీసం పండుగలకు పబ్బాలకు తినేవారు ఈ పద్ధతి నీటికి కొనసాగుతోంది సంప్రదాయ వైద్యంలో అరిటాకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది

అరిటాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల జలుబు దగ్గు లాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే అందులోనే ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరం అవుతాయట వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల దయాబెట్టేసి నియంత్రణలో ఉంటుంది అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్ టిన్ అనే రసాయనం రోగనిరోధక శక్తిని పెంచే టి సేల్స్ పెంపునకు సహాయపడుతుంది అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి

మళ్లీ యూనివర్సిటీలకు ఫార్టీ ప్లస్ వయ స్కూలు

 నైపుణ్యాల పెంపునకు సింగపూర్ నిర్ణయం

కృత్రిమ మేద రాకతో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తుంది ఇందుకోసం పూర్తి కాల డిప్లమా కోరుస్ రూపొందించింది 40 ఏళ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తోంది ప్రస్తుతం నలభై ఏళ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మేంగ్  తెలిపారు.అనుభవజ్ఞులు అయిన ఉద్యోగులు తమ జీవితా అనుభవాలను జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని మెంగ్ అభిప్రాయపడ్డారు

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు