28, మార్చి 2024, గురువారం

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

 ముస్తాబైన ఇందూరు తిరుమల ఏప్రిల్ 2న శ్రీవారి కల్యాణ మహోత్సవం

నిజామాబాద్ రూరల్ మండలంలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో ఉన్న హిందువులు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు కొనసాగలు ఉన్నాయి ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలలో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఏప్రిల్ 2 నా స్వామివారి కల్యాణోత్సవం ఉత్సవ మూర్తులతో పురవీధులలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు 5వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ప్రధాన ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ నర్సింహారెడ్డి విజయసింహారెడ్డి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు నిత్యం సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండే దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకుంటారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన ధర్మకర్తలు పేర్కొన్నారు భక్తులు సపరివార సమేతంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు



హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ 2024 తెలంగాణ

 హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ తెలంగాణ 2024 ఎన్నికలలో అధ్యక్షుడిగా అయ్యాడ రవీందర్ రెడ్డి విజయం సాధించారు అధ్యక్షుడు ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్ రెడ్డి మణికొండ విజయ్ కుమార్ చిక్కుడు ప్రభాకర్ ఏ జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున న్యాయవాదులు హక్కు వినియోగించుకున్నారు ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు జగన్ పై రవీందర్ రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉపాధ్యక్షురాలుగా ఏ దీప్తి జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతి భూషణ్ రావు జిల్లెల్ల సంజీవరెడ్డి జాయింట్ సెక్రెటరీగా వాసిరెడ్డి నవీన్ కుమార్ ట్రెజరర్ గా కట్ట శ్రావ్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ అభిలాష్ విజయం సాధించారు హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ లకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఫలితాలు ప్రకటించడం విశేషం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవా దిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు 2021 లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు



నిజామాబాద్ నగరానికి పుంగనూరు ఆవులు

 


నిజామాబాద్ నగరంలోని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పుంగనూరు ఆవులను కొనుగోలు చేసి తన స్వగృహానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ నేటి కాలంలో కుక్కలు పిల్లలను పెంచే కన్నా ప్రతి ఒక్కరు ఇలాంటి ఆవులను పెంచాలని ఆయన సూచించారు ఈ ఆవులు కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండడం వలన చిన్న చిన్న ఇండ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చు అని ఆయన తెలిపారు ఈ ఆవులను చూడడానికి పలువురు వారి ఇంటికి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రస్ట్,నిజామాబాద్..