27, మార్చి 2024, బుధవారం

నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

 ఉపాధ్యా అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి సందేహాల నివృత్తికి అభ్యర్థులు 7075701768 మరియు 7075701784 నెంబర్లను సంప్రదించవచ్చ

తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలలో సౌదీ

 


సంప్రదాయ ట్యాగ్ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతోంది ఇన్నాళ్లు సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామి కానున్నది 27 ఏండ్ల రుమి అల్క్హాత్తని ఆ దేశ ప్రతినిధిగా ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొననున్నారు రియాదుకు చెందిన రూమీకి గతంలో పలు ప్రపంచ ప్రదర్శనలో పాల్గొన్న అనుభవం ఉంది ఇటీవల మలేషియాలో జరిగిన మిస్సెస్ గ్లోబల్ ఆసియాన్లో ఆమె పాల్గొంది



క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు