25, మార్చి 2024, సోమవారం

కవితల పోటీలకు ఆహ్వానం

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల సందర్భంగా డిహెచ్పిఎస్ శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇజం దళిత బహుజన తత్వం పై కవితల పోటీలు 2024 నిర్వహిస్తున్నారు

గెలుపొందిన మొదటి కవితకు 5000 రూపాయలు రెండవ కవితకు 3000 రూపాయలు మూడవ కవితకు 2000 రూపాయలు నగదు బహుమతితో పాటు అంబేడ్కర్ కవితా పురస్కారంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అంబేడ్కర్ రీజన్ దళిత బహుజన వాదం అంశంపై రాసిన కవితలు మాత్రమే పంపాలి. 25 పంతులకు మించకుండా రాసిన కవితలని పోటీలకు స్వీకరించబడతాయి ఇదివరకు ఎక్కడా ప్రచురణ పొందినవి కాకుండా ఈ పోటీలకు మాత్రమే రాసిన దయ్యం ఉండాలి. హామీ పత్రం చితపరచాలి ఎంపికైన కవితలతో పాటు 133 మంది కవులను ప్రశంసా పత్రం జ్ఞాపికతో సత్కరించడం జరుగుతుంది. పురస్కారానికి ఎన్నికైన వారు స్వయంగా వచ్చే సత్కారాన్ని స్వీకరించవలెను ఎంపికైన కవితలను జాబిలి మాసపత్రికలో ప్రచురించడం జరుగుతుంది

కవితలను ప్రధాన కార్యదర్శి డాక్టర్ శివన్న 9440805955 వాట్స్అప్ చరవాలని సంఖ్యకు ఏప్రిల్ 5వ తేదీ 2024 వ తేదీ లోపు పంపాలి

జాబిలి చాంద్ భాషా అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం

పిడుగు ఎప్పుడు పడుతుంది

 చెప్పడం కష్టం కదా భారత వాతావరణ విభాగం మాత్రం మరీ అంత కష్టం కాదని చెబుతోంది మీ తల వెనకాల మెడకు పై భాగంలో వెంట్రుకలు కాస్త నిక్కబడుచున్నట్లు పైకి లేచినట్టు అయిందంటే మీకు అతి  దగ్గరలో పిడుగు పడే అవకాశం చాన్స్ ఉందని అర్థమట అలాగే వాన రాకడ ప్రాణం పోకడ కూడా ఎవరికీ తెలియదనేది సామెత అయితే ఉరుములు మెరుపులతో జడివాన కురిసే పరిస్థితిని కొన్ని అంశాలతో ముందే గుర్తించవచ్చని ఐఎండి పేర్కొంది ఈ మేరకు ఎక్స్ లో సూచనలు చేసింది ఈ సమయంలో ఆకాశంలో బాగా ఎత్తుగా కాలీఫ్లవర్ వంటి ఆకృతిలోని దట్టమైన నల్లటి మేఘాలు అలాగే నిలువుగా మేఘాలు కమ్ముకుంటాయట అప్పటికప్పుడు చల్లటి గాలివీయడం మొదలవుతుందని ఐఎండి తెలిపింది



మొసలి ఎముకలైనా 30 సెకండ్లలో ముటాష్

 ప్రమాదకరమైన చేపలు అనగానే షార్క్ లు , ఫిరాన గుర్తుకు రావడం కామనే కానీ వాటికన్నా ప్రమాదకరమైన ఒక చేప గురించి తెలుసా పెద్దపెద్ద కోరలాంటి పదునైన పళ్ళతో దొరికితే చాలు చీల్చి పడేసే ఆ చేపలు టైగర్ ఫిష్లు ఆఫ్రికా ఖండంలోని సరస్సులు నదుల్లో కనిపించే ఈ చేపలు టార్గెట్ చేశాయంటే ఎంత పెద్ద చేప అయినా నిమిషాల్లో మఠాషల్సిందే ఈ చేపలు మరీ క్రూరంగా దూకుడుగా వ్యవహరిస్తాయి కేవలం 30 సెకండ్లలో ముసళ్ళ ఎముకలను కూడా కొరికిపడేయగలవు చూడడానికి కూడా కాస్త భయం గోలిపేలా ఉన్న ఈ చేపలు మందలు మందలుగా వేటాడుతాయి

నీటి కోసం వచ్చే పక్షులను పట్టేసి 



ప్రపంచంలో అత్యంత క్రూర ప్రవృత్తి ఉన్న చేపలుగా టైగర్ ఫిష్ లకు పేరు ఉన్నది అడుగు నుంచి మూడు అడుగుల వరకు ఉండే ఈ చేపలు సరస్సులు నదులు ఉపరితలానికి కాస్త కింద ఆ మాట వేస్తాయి నీళ్లు తాగడానికి వచ్చే పక్షులు చిన్నపాటి జంతువులను చుట్టుకుని పట్టేసి కొరికి తినేస్తాయి