22, మార్చి 2024, శుక్రవారం

చక్షకు చెప్పండి

 సైబర్ నేరాల కట్టడానికి కొత్త పోర్టల్ తెచ్చిన కేంద్రం అనుమానాస్పద ఫోన్ నెంబర్లపై రిపోర్ట్ చేసే అవకాశం అలాంటి ఫోన్ నెంబర్లను దర్యాప్తు సంస్థలతో పంచుకోనున్న టెలికాం బ్యాంకులకు సమాచారంతో మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఇటీవలే చక్షు పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

హలో మీకు లక్కీ లాటరీలో 50 లక్షలు వచ్చాయి ఈ మొత్తాన్ని పొందాలంటే మేము చెప్పే బ్యాంకు అకౌంట్ నెంబర్ కు లక్ష రూపాయలు పంపండి మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది

మీ వాట్సాప్ నంబర్ కు వచ్చిన లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందండి

హలో బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతున్నాను. మీకు ఏవైసీ అప్డేట్ చేసుకోవాలి లేదంటే మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు బ్లాక్ అయిపోతాయి మేము అడిగే వివరాలు చెప్పండి

రోజుకు కొత్త తరహా సైబర్ మోసం సైబర్ నీరకాల ఎత్తు ఏదైనా మూలం మాత్రం మన ఫోన్కు వచ్చే కాల్స్ లేదంటే ఎస్ఎంఎస్లు సైబర్ నెరగాళ్లు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. అలా ఫోన్ నెంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరత ఫోన్ నెంబర్ల వివరాలు ఈ వేబు పోర్టల్ లో నమోదు చేస్తే మోసగాళ్ల పని పడతాయి దర్యాప్తు సంస్థలు బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నెంబర్లు పంపుతారు ఇలా చేయడం వల్ల సైబర్ని రకాలు నెంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతో పాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడుతారు సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని మోసపూరిత ఫోన్ నెంబర్ల సమాచారాన్ని పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు

ఏమిటి చక్షు పోర్టల్

చక్ష అంటే కన్ను అని అర్థం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంటర్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ కొత్త సేవ పోర్టల్ ను కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవిటి వలి ప్రారంభించారు అనుమానిత మోసపూరిత కాళ్లు సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చ

చక్ష పోర్టల్ ఎలా వినియోగించాలి


Https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచారసాతి పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి సిటిజన్ సెంటర్ సర్వీసెస్లో చక్ష ఆప్షను సెలెక్ట్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మోసపూరిత కమ్యూనికేషన్ కు సంబంధించిన వివరాలు ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం ఇతర వివరాలు నమోదు చేయాలి ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటిపిని నమోదు చేయాల్సి ఉంటుంది ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది

ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు అంటే అనధికారిక కనెక్షన్లు మనకు వచ్చిన మోసపూరితనంబర్లు సదర వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం ట్రాక్ చేయడం చేయవచ్చు అనుమానాస్పద విదేశీ నెంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు

నకిలీ మందుల సమాచారం ఇవ్వండి 1800596969

 నకిలీ మందులు విక్రయిస్తున్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు డీసీఏ డీజే కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లైసెన్సు లేకుండానే కొన్ని కంపెనీలు మందులను తయారు చేసే విక్రయిస్తున్నట్లు తమ తనిఖీలలో గుర్తించినట్లు చెప్పారు ఇలాంటి ఫిర్యాదులు ఉన్న ప్రజలు 18005996969 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు కాక డిసి అధికారులు కొత్తగూడెంలో చేపట్టిన తనిఖీల్లో టెక్స్లాబ్ అని స్టెరాయిడ్ ఇంజక్షన్ అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ ఇంజక్షన్ అసలు ధర  రూపాయలకు 26 రూపాయలకు గాను సదురు కంపెనీ 39 రూపాయల 90 పైసలుగా ముద్రించినట్లు గుర్తించామని పేర్కొన్నారు నిబంధనలు గ్రహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

 కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి ఎస్బిఐ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు లాంచ్ యాక్సెస్ రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు తీసుకువస్తున్నాయి దీనిపై ఆయా బ్యాంకులో కార్డుదారులకు సమాచారం అందించాయి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు చేసింది ఇప్పటివరకు అర్థ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు అందిస్తున్న బ్యాంక్ ఇకపై ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్లు నిలిపివేసింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్బిఐ ఎందిస్తున్న అన్ని అరుణ్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్ సింప్లీ క్లిక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఐసిఐసిఐ బ్యాంకు కూడా కంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ విషయంలో నిబంధనలను సవరించింది రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే అంతకుముందు త్రైమాసికంలో కనీసం 35వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోరల్ క్రెడిట్ కార్డు మెక్మైట్రిప్ ప్లాటినం క్రెడిట్ కార్డు తో పాటు అన్ని రకాల కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఎస్ బ్యాంకు కూడా లాంచ్ యాక్సెస్ లో నిబంధనలను సవరించింది అంతకుముందు త్రైమాసికంలో 10,000 వ్యయం చేసిన వారికి లాంచ్ యాక్సిస్ ఇవ్వనుంది యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు పై రివార్డ్ పాయింట్ల లాంచ్ యాక్సెస్ తో పాటు వార్షికోత్సవంలో కీలక మార్పులు చేసింది బీమా గోల్డ్ ఆభరణాలు ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇకనుంచి ఎలాంటి రివార్డు పాయింట్లు ఇవ్వడం లేదని తెలిపింది