15, మార్చి 2024, శుక్రవారం

దీర్ఘకాలిక వ్యాధులకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం

 దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఫిజియోథెరపీ నిపుణురాలు రమాదేవి అన్నారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమె తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులకు ఉచితంగా ఫిజియోథెరపీ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా భిక్నూర్ మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో ఆమె వృద్ధులకు ఫిజియోథెరపీ పరీక్షలు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా కీళ్లనొప్పి పక్షవాతంతో బాధపడుతున్న వారు ఆమె చేస్తున్న ఫిజియోథెరపీ వైద్యంతో ఉపశమనం పొందుతున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతోమంది పాలు వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు అట్టి వ్యాధులకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు చిన్న పిల్లల నుంచి బయోవృద్ధుల వరకు తాను ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు నేటి సమాజంలో ఎంతో మంది నిరుపేదలు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారికి తాను ఉచితంగా ఫిజియోథెరపీ చేసి వారి వ్యాధులు నయం చేయడం జరుగుతుందని ఆమె వివరించారు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తమను సంప్రదిస్తే తక్షణమే సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు కీళ్ల నొప్పులు పక్షవాతంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఫిజియోథెరపీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు ఆస్పత్రిలో చుట్టూ తిరిగిన నయం కానీ వ్యాధులు ఫిజియోథెరపీతో నయం అవుతాయని ఆమె తెలిపారు వృద్ధాప్యంలో పలు వ్యాధులతో బాధపడేవారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి కావలసిన ఫిజియోథెరపీ పరీక్షలు ఉచితంగా చేస్తానని ఈ సందర్భంగా ఆమె వివరించారు సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను పలు ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశార



రేపు మెగా లోక్ అదాలత్

 ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో ఈనెల 16న మెగా లోక్ అదాలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సై మహేష్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు రాజీ చేసుకోదగ్గ కేసులకు సంబంధించి మెగాలోకి అదాలతో పరిష్కారం ఉంటుందని అన్నారు దీనిని వినియోగించుకోవాలని కోరారు

ఘనంగా ఆధ్యాత్మిక సమ్మేళనం

 కనహలో యోగా తరగతులు ప్రారంభం వీనుల విందుగా శంకర్ మహదేవన్ సంగీత కచేరి

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హ శాంతి వనంలో ఆధ్యాత్మిక సమ్మేళనా కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ ఫుల్నే సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి హార్ట్ ఫుల్నే సంస్థ గురూజీ కమలేష్ డి పటేల్ ఆధ్వర్యంలో యోగ తరగతులు నిర్వహించారు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత కచేరితో ఆకట్టుకున్నారు కుమారేశ్ రాజగోపాల్ శశాంక్ సుబ్రహ్మణ్యం అద్భుతమైన సంగీతాన్ని అందించారు ప్రపంచంలోని సర్వ మతాలు విశ్వాసాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒకే చోటిక చేర్చడం అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతికి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు