15, మార్చి 2024, శుక్రవారం

రైల్వే ఉద్యోగాలుకు పిఈటిసి ఉచిత శిక్షణ

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ మేరకు పిఈటిసి డైరెక్టర్ సమూజ్వల గురువారం ఒక ప్రకటన లో తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అభ్యర్థులను వారి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు మరిన్ని వివరాలు 04027540104 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

గరం రుచి కోసం

 కూరల్లో గరం మసాలా పొడులు మోతాదు మించితే కూర రుచి మారిపోతుంది చేదు వస్తుంది అలా చేయదు వచ్చినప్పుడు కూరల్లో అరాకప్పు చీకటి పాలు లేదా టేబుల్ స్పూన్ మీగడ కలపాలి పాలు పాల ఉత్పత్తులు ఇష్టపడని వాళ్ళు జీడిపప్పు పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు ఇలా చేస్తే చేదు తగ్గడంతో పాటు కూర రుచి ఇనుమడిస్తుంది కూడా

మార్కెట్లో కొన్న మసాలా పొడుల్లో ప్యాకెట్ సీలు విప్పినప్పుడు ఉన్నంత సువాసన ఆ తర్వాత ఉండదు కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కొని తెరిచిన వెంటనే మొత్తం వాడేయడం ఒక పద్ధతి పెద్ద ప్యాకెట్ కున్నప్పుడు కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్ లోకి గాలి దూరకుండా క్లిప్ పెట్టాలి

గరం మసాల పొడిలను ఇంట్లోనే ఎక్కువ మోతాదులో చేసి నిల్వ ఉంచుకోవాలనుకుంటే పొడి నీ తేమలేని సీసాలో పోసి గాలి చురకుండా మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టాలి ఇలా చేసినప్పుడు ఏడాదంతా నిల్వ ఉంచిన తాజాతనం తగ్గదు

అభయ హస్తం ఫౌండేషన్ పెళ్లి కానుక

 కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాధాశ్రమం విద్యార్థినికి అభయ హస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెళ్లి కానుకలు అందజేశారు ఈ సందర్భంగా సభ్యుడు బర్ల మధుకర్ మాట్లాడుతూ 2009లో ప్రారంభించిన అమ్మ అనాధాశ్రమం అనాధలకు వికలాంగులకు వారికి పెళ్లి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు 2009లో పావని వికలాంగురాలు అధైర్య పడకుండా అమ్మ వెంకట రమణమ్మకు తోడుగా చేసుకుని ఆశ్రమాన్ని ప్రారంభించి ఎందరినో అనాధాలను వికలాంగులను చదివించి మంచి ర్యాంకులతో పాటు మెజారిటీలు సాధించి ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించడం ఎంతో ఆనందదాయకమన్నారు నేడు పావని స్వర్గస్తులైనా కూడా ఆమె ఆశ్రమం ఆగిపోకుండా వారికి పెళ్లిళ్లు చేయడం బాధ్యత తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి అన్నారు ఈ ఆశ్రమంలో విద్యార్థినికి ఇటీవల పెండ్లి కుదరడంతో పెండ్లికి కానుకగా అమ్మాయికి సంబంధించిన నూతన వస్త్రాలను ఇతర కానుకలను అభయహస్తం ఫౌండేషన్ వారి సహకారంతో అందజేయడం జరిగిందన్నారు వారికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని బర్ల మధుకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు బాలసాయి చిత్తర నరేందర్ శ్రీకాంత్ కూర్చారు ఇందూరు సాయి గంగాధర్ రాజు ఆశ్రమం లక్ష్మణ్ బర్ల శ్రీధర్ ఉన్నారు