10, మార్చి 2024, ఆదివారం

ఈ పొడితో క్షణాల్లో బిర్యాని

 బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నీళ్లురుతాయి కానీ అందులో వేసే దినుసులన్నీ అప్పటికప్పుడు నూరాలి అంటే కాస్త పెద్ద ప్రహసానమే. అదే బిర్యాని మసాలా పౌడర్ సిద్ధంగా ఉందనుకోండి ఉప్మా అంతా సులువు అయిపోతుంది ఈ పౌడర్ చేసేందుకు ఒక జాజికాయ రెండు అంగుళాలు దాల్చిన చెక్క 12 లవంగాలు పది యాలకులు మూడు నల్ల యాలకులు రెండు చెంచాల మిరియాలు పావు కప్పు ధనియాలు చెంచా చొప్పున సోంపు జీలకర్ర నల్ల జీలకర్ర కొద్దిగా జాపత్రి 7 8 బిర్యానీ ఆకులు అర చెంచా పసుపు నాలుగు ఎండుమిర్చి రెండు చెంచాల డ్రైవ్ జింజర్ పౌడర్ ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే కడాయిలో బిర్యాని ఆకులు ఎండుమిర్చి వేయించి పళ్లెంలోకి తీయాలి తర్వాత ధనియాలు జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు మంచి సువాసన వచ్చే వరకు వేయించి తీయాలి ఆ తర్వాత జాజికాయ దాల్చిన చెక్క బ్లాక్ కారడమం మిరియాలు యాలకులు లవంగాలు, జాపత్రి కూడా వేయించాలి అన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పసుపు డ్రై జింజర్ పౌడర్ జత చేస్తే సరి గుమగుమలాడే బిర్యాని మసాలా పౌడర్ తయారైనట్లే దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా క్షణాల్లో బిర్యాని చేసుకోవచ్చు

చేర తీసి ప్రేమ పంచి

 ప్రేమను పంచడంలో తల్లుల తర్వాతే ఎవరైనా అన్ని నిరూపించారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఈ మహిళలు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు బ్యాంకు కాలనీలో ఒక వీధి శునకం 10 రోజుల కిందట ఆరు పిల్లలకు జన్మనిచ్చింది రెండు రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అది తినేది ఆహారంలో విషం పెట్టడంతో చనిపోయింది అప్పటికి దాని పిల్లలు కళ్ళు కూడా తెరవలేదు పాలు లేక ఆ పసి కోనలు రోజంతా తెల్లడిల్లాయి తల్లి కోసం రోదిస్తున్న వాటిని స్థానికరాలు శారదా చేర తీశారు ఇంటికి తీసుకెళ్ళి సీసాతో పాలు పడితే తాగలేక ఇబ్బంది పడ్డాయి ఇంటి పక్కనే ఉన్న హేమలత ఓ చిన్నారి సాయం తీసుకొని చిన్న పిల్లలు పాలు తాగే సీసాలో పాలు పట్టారు ఇలా రోజుకు నాలుగు సార్లు పాల్పడుతున్నట్లు శారద చెప్పారు ఎవరైనా కుక్క పిల్లల్ని పెంచుకోవాలని అనుకునే వారు ఉంటే వాటిని అందజేస్తానని పేర్కొన్నారు



15 నుంచి ఇస్కాన్ యువ వేసవి శిబిరం

 ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 16 17 తేదీలలో ఉత్కర్ష యువజన వేసవి శిక్షణ శిబిరాన్ని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించనున్నట్లు ప్రతినిధి రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు గో ఆధారిత వ్యవసాయ శిక్షణ వ్యక్తిత్వ వికాస తరగతులు యోగా ధ్యానం సంప్రదాయ సాంకేతిక విజ్ఞానం మట్టి ఇళ్ల నిర్మాణం తదిత అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు 15 నుంచి 30 వయసు వారు అర్హులన్నారు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు వివరాలకు 9449596039 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు