9, మార్చి 2024, శనివారం

స్వప్నలోక్ కాలనీ అసోసియేషన్ కామారెడ్డి

 కామారెడ్డి పట్టణం పరిధిలోని దేవుని పల్లి లో ఉన్న స్వప్నలోక అసోసియేషన్ కాలనీవాసులు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఇటీవల స్వప్నలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని కాలనీ అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ ఉపాధ్యక్షుడు రాజు కార్యదర్శి దశరథ్ కోశాధికారి మారుతీరావు కార్యవర్గ సభ్యులు రమేష్ సర్దార్ రెడ్డి స్వామి సత్యనారాయణ డాక్టర్ హరీష్ గౌడ్ వెంకటేశ్వర శర్మ హర్ష పాల్గొన్నారు



మైక్రో నానో ప్లాస్టిక్ అంటే ఏమిటి?

 మైక్రో నానో ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుల మారుతున్నాయి శరీరంలోకి చేరుతున్న మైక్రో నానో ప్లాస్టిక్ వల్ల గుండెపోటు క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఇటలీకి చెందిన పరిశోధకులు గుర్తించారు ఎందుకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి కరాటేడ్ ఆర్తరీలలో మెదడుకు రక్త సరఫరా చేసేందుకు మెడకు ఇరువైపులా ఉండే ధమనులు నానో ప్లాస్టిక్స్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు ఇతరుల కంటే రెట్టింపు అవుతున్నట్లు వేరు తేల్చారు కరోటేడ్ ఆర్థరీలను  లను చెడు కొలెస్ట్రాల్ బ్లాక్ చేసినట్లుగానే నానో ప్లాస్టిక్స్ వల్ల కూడా జరుగుతుందని పేర్కొన్నారు ఎండార్ టేరెక్తోమి చేసి తొలగించిన 257 మంది కరోటేడ్ ఆర్థర్ లపై అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు మనుషుల జబ్బులకు ప్లాస్టిక్ కు సంబంధం ఉందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదేనని గుండె సంబబంధ సమస్యలకు ప్లాస్టిక్ కారణమని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ప్రొఫెసర్ రాఫెలే మార్పిల్లా తెలిపారు 0.2 ఇంచుల నుంచి ఒక ఇంచులో 25 వేల వంతు వరకు పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ శకలాలను మైక్రో ప్లాస్టిక్ గా పరిగణిస్తారు ఇంతకంటే చిన్నగా ఉంటే ప్లాస్టిక్ శకలాలను నానో ప్లాస్టిక్ గా పిలుస్తారు

శరీరంలో ఏడాది పాటు కోవిడ్ వైరస్

 కోవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శాకలాలు యాంటీజెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని కణజాలంలో దాదాపుగా రెండేళ్ల వరకు ఉంటున్నట్లు పరిశోధకులు తాజాగా గుర్తించారు చాలామందిలో లాంగ్ కోవిడ్ కు ఇదే కారణమై ఉండొచ్చని  భావిస్తున్నారు వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారి కంటే ఎక్కువ ఉన్న వారిలో దవాఖానలో చికిత్స తీసుకున్న వారిలో వైరస్ యాంటిజెంట్లు రెట్టింపు స్థాయిలో ఉంటున్నట్టు గుర్తించారు    లాంగ్ కోవిడ్ కు గుండెపోట్లకు ఈ వైరస్ శకలాలే కారణమా అనేది కచ్చితంగా నిర్ధారించేందుకు మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకుడు మైకేల్ పెలుసో పేర్కొన్నారు.