6, మార్చి 2024, బుధవారం

11న జాబ్ మేళా

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో టీఎస్ కేసి ది టైమ్స్ ప్రో సౌజన్యంతో యాక్సిస్ ఐసిఐసిఐ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ ఎస్ బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన నియామకాల కోసం ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్ మేళాకు ఏదైనా డిగ్రీ బీటెక్లో 50% మార్కులు కలిగి ఉండి 1996 2003 మధ్య జన్మించి 28 సంవత్సరాల లోపు వారు అర్హులని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సోమవారం ఉదయం పదిన్నర గంటలలోగా బయోడేటా సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాలని తెలిపారు మరిన్ని వివరాలకు టీఎస్ కేసి ఆంగ్ల విభాగంలో లేదా బ్యాంకు ప్రతినిధి కుమార్ 8106764653 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

యూఎస్ సదస్సుకు తెలంగాణ యువతి ఎంపిక

 రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ చందన యూఎస్ జ్యుడీషియల్ విధానం అనే అంశంపై అమెరికాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు మొత్తం 22 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున తెలంగాణ నుంచి చెందిన ఎంపిక కావడం విశేషం చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వుమన్ రైట్స్ అనే అంశంపై ఆమె పోరాటాన్ని గుర్తించిన యుఎస్ ప్రతినిధులు చందనను ఆహ్వానించారు ప్రస్తుతం బచావో ఆందోళన్ లో స్టేట్ కోఆర్డినేటర్ గా ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. చిన్న పిల్లలు మహిళల కోసం యూఎస్ న్యాయవ్యవస్థలో ఉన్న అంశాలతో పాటు వివిధ దేశాల్లోని న్యాయవ్యవస్థలోను ఏ విధంగా ఉన్నాయన్న అంశాల పైన ప్రతినిధులకు నిర్వహించే పలు కార్యక్రమాల్లో తాను పాల్గొని చర్చించనున్నట్లు చందన తెలిపారు అమెరికాలో ఏప్రిల్ 6 నుంచి 27 వరకు జరిగే ఆయా కార్యక్రమాల్లో తాను పాల్గొంటారని తెలిపారు

12 నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గి సేవలు

 ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం తో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషనులకు ఈ సేవలు విస్తరించి ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గి ఐఆర్సిటిసి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది ప్రయాణికులు స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సిటిసి యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో టిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి తమ కోరుకున్న ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు