3, మార్చి 2024, ఆదివారం

విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు

 కామారెడ్డి విద్యానగర్లోని శ్రీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయ నాలుగవ వార్షికోత్సవం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఈనెల 6 7 8 తేదీలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మంగళారపు మోహన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మయ్య తెలిపారు స్వామివారి కల్యాణోత్సవం అన్నదానం అభిషేక విశేష పూజలు ఉంటాయన్నారు

అభివృద్ధి పథంలో సోమేశ్వరాలయం

 నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో సోమలింగాల ఆలయం రంగులు నూతన ప్రాకారాల నిర్మాణంతో అభివృద్ధి చెందుతోంది మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఒకకోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు పలు సమావేశాల్లో తెలిపారు కానీ మంజూరని నిధులు అందుకు పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 60 లక్షల వరకు ఖర్చు చేసి నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయం నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమలింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా వీరా జిల్లా ఉందని ఈ ఆలయం స్వయంభు లింగం నెలకొని ఉన్నందున శివరాత్రి వరకు పనులు పూర్తి కావచ్చు అని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు



ఎస్బిఐ రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం

 ఎస్బిఐ రివార్డ్స్ పేరిట ఒక యువతి సైబర్ మోసానికి గురైనట్లు సిఐ కృష్ణ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండాకు చెందిన విజయ తన ఫోన్లో ఫిబ్రవరి 23న వచ్చిన ఎస్బిఐ రివార్డ్ మెసేజ్ లింకును ఓపెన్ చేసింది అందులో సైబర్ నేరగాళ్లు సూచించినట్లు ఓటిపి ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి 37 37వేల రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన విజయం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 193 ఫోన్ చేసి జరిగిన మోసాన్ని తెలిపి పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు