1, మార్చి 2024, శుక్రవారం

బార్లీ తో బోలెడన్ని సమస్యలు దూరము

 పూర్వం ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికి బార్లీ నీళ్లు సగ్గుజావా తాగించే వాళ్ళు పెద్దలు ఇప్పుడు కూడా బార్లీ కనిపిస్తోంది కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే కేవలం జ్వరంలోనే కాదు వేసవిలో బార్లీ వాడకం చాలా మంచిది అది ఎలాగో చూద్దాం. వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది అజీర్తి దూరమవుతుంది పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగవలసింది మధుమేహంలకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు రోజుల ఉదయము సాయంత్రము బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి మహిళలను తరచు బాధించే ప్రధాన సమస్య మూత్రణాల ఇన్ఫెక్షన్ ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజు గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు వ్యర్ధాలు బయటకు పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి



పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురి

 ఒకప్పటి నిజాం రాజు షికార్ఘర్ ఇప్పటి టూరిస్ట్ స్పాట్ ఇక్కడ కృష్ణ జింకల గుంపులతో పాటు నీలుగా సాంబార్ నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళను చూడవచ్చు వీకెండ్స్ లో పిల్లలతో కాసేపు హాయిగా గడపాలి అనుకునే వాళ్లకు పోచారం వైల్డ్ లైఫ్ షాంపుచూరి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది



ఉదయం నుంచి రాత్రి వరకు పని ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లకు మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ .ఇది మెదక్ కామారెడ్డి జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఉంది నిజాము కాలంలో షికార్గరిగా పేరుందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఫేమస్ పిక్నిక్ స్పాట్ పోచారం శాంకచురీ లో రెండు డీర్ బ్రీడ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని వందల కృష్ణ జింకలు ఉన్నాయి అభయారణ్యంలో అవి గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. వీటితోపాటు నీల్ గాయ్  , సాంబార్ ,నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళు వంటి వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి శాంక్చురి లోపల వెహికల్లో తిరగవచ్చు అభయారణ్య మందాలను చూసేందుకు రెండు వాచ్ టవర్లు ఉన్నాయి శాంక్ చూరి ఎంట్రన్స్ లో విజిటర్స్ కాసేపు రెస్టు తీసుకునేందుకు పార్కు ఉంది ఆకర్షణీయంగా ఉండే రకరకాల పచ్చని చెట్లతో పాటు ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చునేందుకు వీలుగా బెంచీలు భోజనాలు చేసేందుకు షెడ్డు మంచినీళ్లు ఉన్నాయి పార్కు దగ్గరలో అటవీశాఖ వాళ్ళు 50 లక్షల రూపాయలతో పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మించారు ఇందులోకి వెళ్లే వన్యప్రాణుల జీవన విధానం గురించి అవగాహన కలుగుతుంది ఆదివారాలు సెలవు రోజులలో మెదక్ కామారెడ్డి జిల్లా నుంచి ఫ్యామిలీస్ తో ఇక్కడికి వస్తారు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్కూల్స్ కాలేజీ స్టూడెంట్స్ విజ్ఞాన యాత్రలో భాగంగా పోచారం  శాంక్చురీ కి వస్తారు 





అడవిలో అర్బన్ పార్క్.. ఆకర్షణీయమైన ఎంట్రన్స్ లు ఆకట్టుకునే గజిబోలు ఎత్తైన వాచ్ టవర్లతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది మెదక్ జిల్లా నరసాపూర్ అర్బన్ ఫారెస్ట్.. హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే లో అనుకోని ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్ లో 20 కోట్ల రూపాయల వ్యయంతో 200765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ డెవలప్ చేశారు అడవిచుట్టు ఏడు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు అర్బన్ పార్కులోకి వెళ్లేందుకు రెండు మెయిన్ గేట్లు ఉన్నాయి అడవి అందాలను చూడడం కోసం 60 ఫీట్ల ఎత్తులు రెండు వాచ్ టవర్లు కట్టారు విజిటర్స్ కాసేపు రెస్ట్ తీసుకునేందుకు ఒక గజబు ఏర్పాటు చేశారు కలపలా కనిపించే కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ విజిటర్స్ కూర్చునేందుకు ఎత్తైన బండమీద సిమెంట్ బెంచీలు నీరు పారే ప్రాంతాలలో బ్రిడ్జిలు కట్టారు. అర్బన్ పార్కును నడిచి చూసేందుకు వీలుగా మట్టి రోడ్లు వేశారు సైకిల్ ఎక్కి కూడా చేయవచ్చు ఆదివారాలు ఇతర సెలవు రోజులలో ఎక్కువ మంది విజిటర్స్ హైదరాబాద్ నుంచే వస్తారు ఇక్కడికి


గుడ్లు ఎన్నో రకాలు

 



ప్రస్తుతం మార్కెట్లో గుడ్లు ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఒమేగాత్రి డే విటమిన్ కారిడియో అంటూ రకరకాల పేర్లతో ఎగ్స్ కనిపిస్తున్నాయి పౌల్ట్రీ గుడ్లు తెలుసు నాటుకోడి గుడ్లు తిన్నాము కానీ ఇన్ని రకాల గుడ్లు ఎలా ఉన్నాయంటే..

రోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి డోకా ఉండదని చాలామంది చెబుతుంటారు విటమిన్లు క్యాల్షియం ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట నిజమే మరైతే పోషకాల నిలయంగా చెప్పే గుడ్డులోని అదనంగా ఇలాంటి విటమిన్ లను జత చేస్తే ఒక్క ఎగ్గుతోనే ఎంతో బలం వస్తుంది కదా అనుకున్న ఉత్పత్తిదారులు బోలెడన్ని వెరైటీ ఎగ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు మార్కెట్లో నాటుకోడి గుడ్లు, పౌల్ట్రీ కోడిగుడ్లు ఎప్పటినుంచో ఉన్నాయి తర్వాత సేంద్రియ కోడిగుడ్ల లాంటిది అందుబాటులోకి వచ్చాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే కోడిగుడ్డు విలువ అందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఇళ్లలో అల్పాహారంలో దీనిని భాగం చేశారు ఆరోగ్యానికి కోడిగుడ్డుకి ఉన్న ఈ బలమైన బంధం వల్లే ఇప్పుడు మరికొన్ని కొత్త రకాల గుడ్లు వస్తున్నాయి

ఎన్నెన్ని రకాలు. . కోళ్లకు పెట్టే ఆహారంలోనే రకరకాల మార్పులు చేస్తూ విటమిన్-డి విటమిన్ ఈ ఒమేగాత్రి విటమిన్ ప్లస్ ఎగ్స్ ఇంకా అన్ని రకాల విటమిన్లు కాపర్ లాంటి ఖనిజాలు ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ గుడ్లను తయారు చేస్తున్నారు ఉదాహరణకు కోళ్లకు అవిస గింజల లాంటి ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలు ఇచ్చే పదార్థాలతో ప్రత్యేకమైన డైట్ ఇస్తూ ఒమేగాత్రి ఎగ్స్ ను తయారుచేస్తారు కేవలం శాఖాహార అందిస్తూ వెజిటేరియన్ ఎగ్స్ ని ఉత్పత్తి చేస్తారు ఒక్కోరకమైన గుడ్డు కోసం కోళ్లకు పెట్టే దానాలు మార్పులు చేస్తూ ఒక్కో డైట్ ని డిజైన్ చేస్తారన్నమాట

సాధారణంగా గుడ్డులో ప్రోటీన్ అమైను ఆమ్లాలు బి కాంప్లెక్స్ విటమిన్లు డి విటమిన్ ఇతర ఖనిజాలు ఉంటాయి కానీ వీటికి అదనంగా పోషకాలను కలుపుతూ ఈ కష్టమైజ్డ్ ఎగ్స్ ని తయారు చేస్తున్నారు విటమిన్ ల గుడ్లు మాత్రమే కాదండోయ్ డయాబెటిక్స్ కి ప్రత్యేకంగా రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరిచే క్రోమియం ఖనిజాన్ని చేర్చుతూ దయాబెట్ ఎగ్స్ ను తక్కువ కొవ్వు ఎక్కువ ప్రోటీన్లతో ఉండే కారుడియో ఎగ్స్ ను ఫిట్నెస్ ట్రిక్స్ కోసం ప్రోటీన్ బ్రౌన్ ఎగ్స్ ను తీసుకొచ్చారు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ చిన్నారుల ఎదుగుదలకు అవసరమయ్యే విటమిన్లు ఖనిజాలు ఇవ్వాలనుకుంటే సాధారణ కోడిగుడ్డుకు బదులు ప్రత్యేకమైన ఈ పోషకాల గుడ్లను ట్రై చేసి చూడవచ్చు తమ తమ అవసరాలను బట్టి పెద్దవాళ్ళు వీటిని తినవచ్చు