29, ఫిబ్రవరి 2024, గురువారం

చిలి సముద్ర జలాల్లో నడిచే చేప

 చిలి కోస్తా తీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన నడిచే చేప కెమెరా కంటికి చిక్కింది రెండు కాళ్లు రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలి కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా 100కు పైగా కొత్త జీవజాతులను వారు గుర్తించాలని వైస్ ఆఫ్ అమెరికా తాజాగా తెలిపింది. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలలో ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇందులో నడిచే చేపలు కొన్ని దశాబ్దాలకు ఒకమారు మనకు కనిపిస్తుంటాయి రోబోలను ఉపయోగించి విస్తృతమైన సముద్రతీరా భూభాగాన్ని అన్వేషిస్తుండగా వీటిని సైంటిస్టుల బృందం గుర్తించింది నాలుగు కొత్త సముద్ర పర్వతాలను కూడా కనుగొన్నాము అని ఓషియన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీర్మాని చెప్పారు


హెచ్ వన్ బి రిజిస్ట్రేషన్ కు కొత్త విధానం

 హెచ్ వన్ బి రిజిస్ట్రేషన్ పిటిషన్ కి సంబంధించి అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మై యూఎస్సీఐఎస్ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా సంస్థలు వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియల సమర్థంగా భాగస్వామ్యం ఎందుకు వీలవుతుంది 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బిషన్స్ దాఖలు చేసే సంస్థలు మయు ఎస్సీ ఐఎస్ లో ఆర్గనైజేషన్ ఖాతా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది

ప్రాసెస్ ఫుడ్ తో 30కి పైగా రోగాలు

 అకాల మరణముప్పు పెరిగే ప్రమాదం తాజా అధ్యయనం హెచ్చరిక

తరచూ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుల్ తీసుకుంటే క్యాన్సర్ గుండే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది అంతేకాకుండా దీనివల్ల మానసిక అనారోగ్యం అకాల మరణం ఉప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది పరిశ్రమలలో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో విటమిన్లు పీచు తక్కువగా చక్కెర ఉప్పు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా యుఎస్ ఫ్రాన్స్ ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణము ఉప్పు 50% పెరుగుతుందని సాక్షాధారాలతో నిరూపించారు ఈ అధ్యాయంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22% ఎక్కువ అని తేల్చారు ఈ నేపథ్యంలో ప్రజా రోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు అల్ట్రా ప్రాసెస్ ప్యాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు కొవ్వులు ఉన్నాయని ముద్రించడం ప్రచారం అమ్మకాలు నిషేధించడం ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలో మెలిస్సా ఎం లానే సూచించారు