26, ఫిబ్రవరి 2024, సోమవారం

కాఫీ టీ తాగిన తర్వాత ఏం చేయాలి?

 దంతాలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి మనం చేసే చిన్నపాటి పొరపాట్లు మనకున్న చెడు అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి

కొందరికి ఐస్ ముక్కలు కొరికే అలవాటు ఉంటుంది మంచు గడ్డలు రాళ్ల కంటే బలమైనవి ఫలితంగా పళ్ళు విరిగిపోని వచ్చు ఆ చల్లదనం పళ్ళ లోపలి బాగాన్ని కూడా దెబ్బతీస్తుంది

కాఫీ టీ లలోని క్షరత్వం వల్ల పళ్ళ మీద మరకలు ఏర్పడతాయి సూక్ష్మ క్రిములు పెరిగేందుకు ఇది సహాయపడతాయి ఫలితంగా చిగుళ్ల వాపు నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా వస్తాయి అందుకే కాఫీ టీ తాగిన కాసేపటికి నోరు పుక్కిలించాలి

నిమ్మరసం లాంటి పుల్లటి ద్రవాల వలన ఎసిడిటీ రావచ్చు అది పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది ఇలాంటి పానీయాలు తీసుకున్న తర్వాత చూయంగం నమిలితే కొంత ఉపశమనం లభిస్తుంది

తినగానే బ్రష్ చేసుకోవడం చాలా మంది అలవాటు ఆమాత్రం జాగ్రత్త మంచిదే కానీ తిన్న 30 నిమిషాల వరకు ఆగితే మేలు

గోల్డ్ కొరక్కొని అలవాటు పళ్ళ ఆకృతిని దెబ్బతీస్తుంది అంతేకాదు దవడ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది

బాగా అరిగిపోయిన తర్వాత కూడా టూత్ బ్రష్ మార్చకపోవడం కూల్డ్రింక్స్ అధిక తీసుకోవడం నిద్రలో పళ్ళు కొరకడం తదితర అలవాట్లు కూడా మంచిది కాదు

చిన్నపిల్లలలో మధుమేహం

 రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు మధుమేహం రెండు రకాలు టైపు అండ్ డయాబెటిస్ టైప్ టు డయాబెటిస్ పిల్లలలో చాలావరకు టైపు అండ్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి డాక్టర్ సిఫారసు ప్రకారం ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి పరిష్కారం భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి తగిన పోషకాహారం ఇవ్వాలి నిత్య వ్యాయామం అవసరమే ఇలాంటివారు జీవితమంతా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దగా నొప్పి అనిపించదు పిల్లలకు మధుమేహం ఉన్న విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలి. దీని వలన ఇన్సులిన్ హెచ్చుతగ్గుల ప్రభావంతో వచ్చే హైపోగ్రాసిమియా తదితర వ్యాధుల లక్షణాలను గమనించినప్పుడు మన దృష్టికి తీసుకొస్తారు అదే సమయంలో పిల్లలకు ఆరోగ్యకర జీవనశైలిని పరిచయం చేయాలి మీరు భయపడవలసిన అవసరం లేదు మధుమేహం ఉన్న పిల్లలు కూడా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడప డం సాధ్యమే తక్షణం పీడియాట్రిక్ ఎండోక్రైనాలసిస్ ను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. అదే తగ్గిపోతుంది చిట్కా వైద్యంతో ఇన్సులిన్ ఇవ్వడంలో ఆజాగ్రత్త వహిస్తే డయాబెటిస్ కిటో ఎసిడోసిస్ లాంటి ప్రాణాంతక సమస్యలు ఎదురు   కావచ్చు.

నిద్రకు ముందు

 నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు శరీరానికి మనసుకు రీఛార్జ్ టైం తగినంత నిద్ర లేకపోయినా ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా మానసిక శారీరక సమస్యలు తప్పవు అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు అది ఏమిటంటే

గురువెచ్చటి పాలు ..అనాదిగా పెద్దలు చేస్తున్న సూచన ఇది ఎందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు పాలలోని ట్రిప్ట్ ఆఫ్ పాన్ అనే రసాయనం నిద్రను మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిని హార్మోన్లను ప్రేరేపిస్తుంది నిద్రను ఆహ్వానిస్తుంది

చామంతి టీ.  ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయ మీది ఇందులోని ఏపీ జెన్యూన్ అనే రసాయనం మెదడు సేద తీరేలా చేస్తుంది దాంతో ఒత్తిడి తగ్గి నిద్ర పట్టేస్తుంది

వలేరియాన్ టీ.. ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్ కు మత్తెక్కించే లక్షణం ఉంది నిద్రలేమి నీ ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది

కషాయాలు.. లావెండర్ నిమ్మ కృష్ణ కమలం లాంటి ఔషధ మొక్కలతో రూపొందించిన కషాయాలు కూడా నిద్రకు మేలు చేస్తాయి.