26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆహార పదార్థాలు మిగిలిపోతే

 కామారెడ్డి పట్టణ పరిధిలో నిర్వహించే శుభకార్యాలలో ఆహార పదార్థాలు మిగిలిపోతే బాంబే క్లాత్ హౌస్ లో అందజేయాలని నిర్వాహకులు కోరారు తాము వెంటనే పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు వివరాలకు 9441922678 9963530055 నెంబర్లను సంప్రదించాలని సూచించారు

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

 కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న పతాంజలి యోగ సమితి ఎస్ఎస్వై యోగ సెంటర్ వార్షికోత్సవాన్ని యోగ భవన్లు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురువు రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ నరేందర్ గాంధారి మాజీ జెడ్పిటిసి దానాజీరావు యోగా గురువు గరిపల్లె అంజయ్య గుప్తా బాసర కుమార్ అంజయ్య ఈశ్వర్ కరుణశ్రీ హిమబిందు సిద్ధ గౌడ్ ఎల్లయ్య రాములు యాదవ్ ఎల్లంకి సుదర్శన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా రోటరీ క్లబ్ వార్షికోత్సవము

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి రోటరీ క్లబ్లో 49వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పూల బోయిన సత్యం మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధ్యక్షులు శక్తివంతన లేకుండా సామాజిక కార్యక్రమాలలో సేవలు చేసినందుకు ప్రతిష్టంగా ఉందని అన్నారు అనంతరం పూర్వాధ్యక్షులను సన్మానించారు ఐదుగురు విద్యార్థులకు సైకిల్ అందజేశారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ప్రతినిధులు శ్రీశైలం కాశీనాథం ధనంజయ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ బాలరాజు చంద్రశేఖర్ వెంకటరమణ కృష్ణమూర్తి కాశీనాథరావు అంజయ్య హరిస్మరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు