26, ఫిబ్రవరి 2024, సోమవారం

అమ్మవారిపేటలో సరస్సులోఅరుదైన పక్షి

 వరంగల్ పట్టణానికి సమీపంలోని అమ్మవారిపేట సరస్సు వద్ద దేశంలోనే మొదటిసారిగా కనిపించిన అరుదైన స్పర్ వింగుడ్  లాప్ వింగ్ పక్షులు కనువిందు చేస్తున్నాయి వీటిని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పక్ష ప్రేమికులు తరలివస్తున్నారు.



లొకేటర్ యాప్ తో ఇంటర్ ఎగ్జామ్స్ సెంటర్ కు దారి

 మీరు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారా పరీక్ష కేంద్రం అడ్రస్ ఎక్కడ అని వెతుకుతున్నారా మీ ప్రయత్నాలన్నీ ఆపేసి మీ మొబైల్ లో టిఎస్బిఐఇ సెంటర్ లొకేటర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో మీ ఎగ్జామ్స్ సెంటర్ కోడును హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయండి అంతే ఆటోమేటిక్గా ఆ యాప్ ఏ మీ ఎగ్జామ్స్ సెంటర్ రూట్ ను చెప్పేస్తుంది ఎగ్జామ్స్ సెంటర్ తెలియదన్న టెన్షన్ సమయానికి చేరుకోలేక పోతా మేమున్న ఆందోళన అవసరం లేకుండా నిశ్చింతగా పరీక్షలకు హాజరు కావచ్చు ఇంటర్ వార్షిక పరీక్షలు 28 నుంచి ప్రారంభం కానున్నాయి విద్యార్థులు తమ సందేహాలకు 04024655027 ను సంప్రదించవచ్చ

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆంగ్లభాషపై 26న రాష్ట్రస్థాయి పోటీలు

 తెలంగాణలోని విద్యార్థులలో ఆంగ్లభాష ప్రావీణ్యం పెంచడానికి నాటిక పోటీలు ఆంగ్ల పదాల రాష్ట్రస్థాయి పోటీలను ఈ నెల 26న హైదరాబాద్ అన్నోజిగూడ లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆంగ్లభాష ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి వెంకటేశ్వరరావు విజయ ధర రాజులు శనివారం తెలిపారు మండల జిల్లా స్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి హైదరాబాదులో పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు .