25, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆధ్యాత్మిక సమాచారం 25 ఫిబ్రవరి 2024

 ఆలయంలో ఎంపీ పూజలు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం ఆయన నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు దర్శనం అనంతరం అధికారులు ఆయనను సన్మానించారు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ భక్తులు ఉన్నారు





తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారికి అర్చనలు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ ఉన్నారు

దాతలు అందజేసిన 17 లక్షల రూపాయల విరాళాలతో బీర్కూర్ కోదండ రామాలయం వెనుక భాగాన అన్నదాన సత్రం స్లాబ్ పనులను శనివారం ఎంపీపీ రఘు కమిటీ సభ్యులు ప్రారంభించారు కమిటీ సభ్యులు విట్టల్ గంగారం రాజు యోగేశ్వర్ ఉన్నారు

సరస్వతీ విగ్రహ ఆవిష్కరణ బీర్కూరు గడి కింది బాలికల ప్రాథమిక పాఠశాలలో మీరు కోరుకు చెందిన విఠల్ అనే ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు సొంతంగా 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శనివారం ఎంపీపీ రఘు పిఆర్టియు నాయకులు ఆవిష్కరించారు హెచ్ఎం వేణుగోపాల్ పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ తదితరులు ఉన్నారు

గులాబ్ బాబా ఆశ్రమానికి పాదయాత్ర బీర్కూరులో గులాబ్ బాబా గురు స్వామి కొండలవాడి మాధప్ప ఆధ్వర్యంలో శనివారం బాబా భక్తులు మహారాష్ట్రలోని కాటేద్దాం గులాబ్ బాబా ఆశ్రమానికి 30 మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు 13 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని మాదప్ప చెప్పారు

దేశ సంస్కృతి పరిరక్షణకు యువత పాటుపడాలని నేషన లిస్ట్ హబ్ చానల్ ceo సాయికృష్ణ అన్నారు జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల 41 వార్షికోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది పాఠశాల అధ్యక్షుడు శ్యాంసుందర్ ప్రతినిధులు హరిస్మరణ రెడ్డి రాజిరెడ్డి మల్లేష్ యాదవ్ ప్రతాప్ గౌడ్ అశోక్ రావు శంకర్ లాల్ రంజిత్ మోహన్ చారి శ్రీనివాస్ ప్రధాన చాలు నాగభూషణం తదితరులు ఉన్నారు

పరిమళంతో జ్ఞాపకం

 అమ్మకి ఇస్తే జాగ్రత్తగా దాస్తుందని పిల్లలు వస్తువులను మనకు ఇస్తారు తీరా తిరిగి వాళ్ళు అడిగినప్పుడే చిక్కంతా వస్తుంది. జాగ్రత్తగా దాచి పెట్టామని మాత్రమే గుర్తుంటుంది అయితే ఎంతకు జ్ఞాపకం రాదు వంటి ఎదురైనప్పుడు జ్ఞాపకశక్తి దూరమవుతుంది అలాగే మెనూ పాజి సమయంలోను ఇది తగ్గుతుంది దీని తిరుగు తీసుకురావడంలో పరిమళ ద్రవ్యాలు సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి మెదడులో మరుగున పడే జ్ఞాపకాలను తిరిగి పరిమళ ద్రవ్యాల వాసనలతో బయటకు తేవచ్చు అని పిక్స్బర్కు స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధక బృందం తాజాగా ఒక అధ్యయనంలో తీర్చండి. జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం తీవ్రంగా ఆలోచించేటప్పుడు మెదడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది అయితే తీవ్ర ఒత్తిడి వల్ల మెదడులోని అక్కడి భాగం నియంత్రణకు గురవుతుంది ఈ సమస్య ఉన్న కొందరికి కాఫీ గింజలు లవంగాలు నారింజ ఎసెన్షియల్ ఆయిల్ వంటి వాటితో చేసిన కొన్ని రకాల పరిమళ ద్రవ్యాల వాసనలను చూపించారు దానితో దూరమైన వారి జ్ఞాపకాలు క్రమేపీ తిరిగి రావడం మొదలయ్యాయి అలాగే పలు రకాల సమస్యలతో కొంగుబాటుకు గురయ్యే వారి విషయంలో కూడా కౌన్సిలింగ్ కన్నా పరిమళ ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తీర్చారు చిన్న చిన్న విషయాలను కూడా ఒత్తిడి మరిచిపోయేలా చేస్తోంది అందుకే ఉదయం ఇంటి పని మొదలుపెట్టేటప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు గతిని సహజ సిద్ధ పరిమళాలతో నింపితే చాలు జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.

రేషన్ కార్డు ఈ కేవైసీ ఈనెలాఖరుతో ముగుస్తున్న గడువు

 రేషన్ కార్డుకు ఈ కేవైసీ గడవు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది ఇప్పటికే గడువును రెండు మార్లు పొడిగించిన ఆశించిన స్పందన రావడం లేదు ఈ కేవైసీ చేయించడంలో తీవ్ర జాప్యం కలుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులలో కేవలం 5% మంది లబ్ధిదారులు మాత్రమే చేయించుకున్నారు మిగతావారు ఆధార్ అప్డేట్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో కలిపి 78.84 శాతం మంది ఈ కేవైసీ నమోదు పూర్తయినది ఇంకా నాలుగు లక్షల 5379 మంది చేయించుకోవలసి ఉంది

బియ్యం సరఫరా నిలిచిపోతుంది రేషన్ కార్డుకు ఈ కేవైసీ పూర్తి చేయించుకోకుంటే బియ్యం సరఫరా నిలిచిపోనున్నది రేషన్ కార్డులో పేర్లు నమోదయి ఉన్న లబ్ధిదారులు అసలైనవారా లేదా అనేది తెలుసుకోవడానికి కేంద్రం ఈ ప్రక్రియ చేపట్టినది ఉమ్మడి జిల్లాలో 60 శాతం ఈ కేవైసీ నెల రోజుల్లోనే పూర్తయింది మిగతా 18 శాతం పూర్తికావడానికి సుమారు రెండు నెలల సమయం పట్టింది చాలామంది ఆధార్ నవీకరించుకోకపోవడం చిన్నారుల వేలిముద్రలను అప్పుడే చేయించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది 

మరో నెల సమయం ఇస్తేనే..

 చాలామంది అర్హులు ఈ కేవైసీ నమోదు చేయించుకోలేకపోతున్నారు ఇప్పటికే రెండు మార్లు గడువు పెంచిన ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పెంచితే నమోదు శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది కొన్ని చోట్ల రేషన్ డీలర్లు అందుబాటులో లేక ప్రక్రియ నిమ్మదిస్తోంది ఈ కేవైసీ నమోదు కోసం డీలర్లు వారి దుకాణాల్లో ఉదయం సాయంత్రం కొంత సమయం కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు