21, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెరక శ్రీనివాస్ బుధవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ ఆలయం గ్రామ యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేందర్ గ్రామస్తులు రమేష్ రాములు లక్ష్మయ్య ఆనంద్ ధర్మయ్య గంగారం పాల్గొన్నారు



హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి

 టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడర్ లోయర్ గ్రేడ్ పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ పరీక్షలు 24 నుంచి 27వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.bse.Telangana.gov.in నుంచి అభ్యర్థి పేరు పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు

విదేశీ ఉన్నత విద్య స్కాలర్షిప్ నాకు దరఖాస్తు చేసుకోవాలి

 తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ పార్సి విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 2023 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులు చదివేందుకు స్కాలర్షిప్లు లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అన్ని అర్హత ప్రమాణాలు కలిగి విదేశీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులు ఆగస్టు 1 2023 నుంచి డిసెంబర్ 31 2023లో పర్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో www.Telanganaepass.cgg.gov.in   ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి అన్నారు అర్హత ఉన్న విద్యార్థులు మార్చి 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 22 మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం లేదా 8096973346 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని తెలిపారు