21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆలయంలో పూజ సామాగ్రి దుకాణానికి వేలం

 మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా సామాగ్రి దుకాణానికి బుధవారం వేలం నిర్వహించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా ఏడుగురు పాల్గొన్నారు కృష్ణ అనే భక్తుడు 5 లక్షల రూపాయల నాలుగు వేలకు దుకాణాన్ని దక్కించుకున్నాడు గత ఏడాది కంటే 53000 అధిక ఆదాయం బాగా వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు వేలంలో ఆలయ ఈవో శ్రీధర్ సిబ్బంది వేణు కల్పన తదతరులు పాల్గొన్నారు



అయోధ్యకు తరలిన భక్తులు

 రామ మందిరాన్ని దర్శించుకోవడానికి ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామం నుంచి భక్తులు మంగళవారం బయలుదేరి వెళ్లారు అయోధ్యకు తరలిన వారిలో మర్రి బాలకిషన్ బత్తిని దేవేందర్ గజాననంద్ అన్నా సాగర్ మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు తదితరులు ఉన్నారు



రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

 కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగా వెంకటేశ్వర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రంలోని లయోలా పాఠశాలలో సీనియర్స్ పురుషుల కబడ్డీ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపికైన వారు మార్చి 2 నుంచి 4 వరకు నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీలో నిర్వహించే 70వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు ఎంపికలో పాల్గొనేవారు 85 కేజీల లోపు బరువు ఉండాలని ఆధార కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని పేర్కొన్నారు సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాణాల భాస్కర్ రెడ్డికి రిపోర్ట్ చేయాలని లేదా 9398571110 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని తెలిపారు