ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన దుర్గాదేవి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు కార్యక్రమంలో మల్లారం లింగేశ్వర ఆశ్రమం పీఠాధిపతి తపశ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మండల సీనియర్ నాయకులు దొడ్ల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్ సరిత తదితరులు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఫిబ్రవరి 2024, బుధవారం
ఆడబిడ్డ పుడితే రూపాయిలు 5000
టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి నాడు బాల్కొండ మాజీ జెడ్పిటిసి జోగు సంగీత నరసయ్య వినూత్న కార్యక్రమం చేపట్టారు ముప్కాల్ మండల కేంద్రంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి తన సొంత డబ్బులు 5000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు ఇందులో భాగంగా ముప్కాల్ లో ఓ చిన్నారి కుటుంబానికి బుధవారం 5000 రూపాయల డిపాజిట్ పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్ దాసు ఉన్నారు
లడక్ శిఖరం పై అన్న సాగర్ వాసి
ఎల్లారెడ్డి మండలంలోని అన్న సాగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షాదుల్ భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు అతడు సముద్రమట్టానికి 18 అడుగుల ఎత్తులో మైనస్ 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లడాక్ శిఖరాన్ని చేరుకున్నాడు అక్కడ అన్న సాగర్ ప్రదర్శించాడు గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అతనికి అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు


