19, ఫిబ్రవరి 2024, సోమవారం

మట్టి స్నానం ప్రకృతి వైద్యం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద ఆదివారం జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మట్టి స్నానం చేశారు ఇందులో భాగంగా 90 మంది మట్టి స్నానం చేశారు మట్టి స్నానం ప్రకృతి చికిత్స లాంటిదని అనేక వ్యాధులు దూరమవుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా గురువు రామిరెడ్డి అంజయ్య రఘుకుమార్ డాక్టర్ దేవయ్య డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపతి యాదవ్ ఉరుదొండ నరేష్ శివాజీ రావు లింగారావు తదితరులు పాల్గొన్నారు




మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు 58 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని మేనేజర్ ఇందిరా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బస్సులు మేడారం వెళ్తున్నందున డిపో పరిధిలో రద్దీ తక్కువగా ఉన్న గ్రామాలకు తక్కువగా నడుపుతామని ప్రజలు సహకరించాలని కోరారు

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ 2024

 తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ సెక్రటరీగా కిరణ్ చారి ఎన్నికయ్యారు శనివారం హైదరాబాదులో అసోసియేషన్ ఏజీఎం ఎన్నికలు నిర్వహించారు ప్రెసిడెంట్గా వి నవీన్ యాదవ్ సెక్రటరీగా కిరణ్ ట్రెజరర్ గా వెంకట్ కోము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గం త్రోబాల్ వార్షిక క్యాలెండర్ ను ప్రతిపాదించడంతోపాటు హైదరాబాదులో జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహణ ప్లాన్స్ పై చర్చించింది