18, ఫిబ్రవరి 2024, ఆదివారం

19న రక్తదాన శిబిరం

 బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆస్పత్రిలో ఈనెల 19న రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర జగద్గురువు నరేంద్ర చార్య మహారాజ్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు రక్తదానం చేసేవారు 7386694757కు ఫోన్ చేయవచ్చని తెలిపారు



తోలులోనూ పోషకాలు

 పోనీ కూరగాయలు పండ్లను తొక్కు తీయకుండానే తినాలి తొక్కులో ఉండే పోషకాలు నష్టపోకుండా ఉండడం కోసం వాటిని తొక్కుతో సహా తినడం అలవాటు చేసుకోవాలి ఇంతకు ఆ పనులు కూరగాయలు ఏవంటే

 జుకిని 

సలాడ్ కోసం ఉపయోగించే జుకిని తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పీచు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పచ్చిగా తినాలనుకున్న ఉడికించాలనుకున్న దీన్ని అలాగే నేరుగా వాడుకోవాలి

పియర్స్ ఆపిల్స్ 

ఈ పండ్ల తొక్కలో పీచు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి వీటిని కూడా శుభ్రంగా కడిగే అలాగే తినేయాలి

క్యారెట్లు బంగాళాదుంపలు 

వీటి తొక్కులో పొటాషియం పీచు ఉంటాయి కాబట్టి వీటిని బాగా శుభ్రం చేసి అలాగే వండుకోవాలి

కీర 

కీరలో తోలులో పీచు విటమిన్ కి ఖనిజలవణాలు ఉంటాయి కాబట్టి కీరాను తోలు తీయకుండానే తినాలి



కామారెడ్డి ఆర్టీవో గా కె శ్రీనివాస్ రెడ్డి

 కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా కె శ్రీనివాస్ రెడ్డి శనివారం నియామకమయ్యారు గతంలో ఇక్కడ ఆర్టీవో గా పని చేసిన ఎన్ వాణి హైదరాబాద్లోని ఉప్పల్కు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం కే శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవో కార్యాలయంలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా ఆయనని ఆర్టీవో గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు వాహనదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు