3, ఫిబ్రవరి 2024, శనివారం

తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం 2024

 పెన్షనర్లు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య పథకం వర్తింప చేయకపోవడం అని తెలంగాణ రిటైర్డ్ గెజిటర్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మోహన్ నారాయణ ఎస్ నరసరాజు అన్నారు శుక్రవారం టిఆర్జిఓఏ కార్యాలయంలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పిఆర్సి 23ని త్వరగా అమలు చేయాలని విన్నవించాలి

గ్రామాల వారీగా ఫిర్యాదు పెట్టెను

 కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రజలకు మరింత చేరువ కు కృషి చేస్తున్నారు. సమస్యలను విన్నవించుకునేందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ప్రజలు తరలి వస్తుండడంతో వారికి దూర భారాన్ని తగ్గించేందుకు గ్రామాల వారీగా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయించారు మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ ప్రధాన చౌరస్తాలలో పెట్టెలను ఉంచారు సమస్యలపై ప్రజలు పెట్టిలో వేసిన ఫిర్యాదులను ఎమ్మెల్యేకు అందజేస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు ఎమ్మెల్యే నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

 విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్క్ షాప్ లో డీజీపీ రవి గుప్తా

ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని డిజిపి రవి గుప్తా అన్నారు ఈ నేరాల కట్టడికి దేశంలోని తొలిసారిగా రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శుక్రవారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ నేరాలపై అవగాహన వర్క్షాప్ నిర్వహించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వర్క్ షాప్ లో డిజిపి రవి గుప్తా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ తనకు సైతం సైబర్ నేరగాళ్ల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చాయని వెల్లడించారు హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచితే దాదాపు 60 శాతం సైబర్ నేరాలు తగ్గ అవకాశం ఉంది అన్నారు సైబర్ నీరకాల మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాను కోరార కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు విశ్వజిత్ దేవేందర్ సింగ్ ఏసీబీ నుంచి కేవీఎం ప్రసాద్ పాల్గొన్నారు