2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

క్రీడా కారిణి ని సన్మానించి న ఐ టీ శాఖా మంత్రి

 తక్కడపల్లి గ్రామానికి చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ప్రతిభా పాటిల్ను రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కేమ్రాజ్ కళ్యాణి సర్పంచ్ రమేష్ తో కలిసి గురువారం సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలికలు క్రీడలలో రాణించడం గొప్ప పరిణామమని కొనియాడారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆటలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు క్రీడలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవచ్చని తెలిపారు.

అగ్రిషో కిసాన్ 2024

 వ్యవసాయ రంగానికి అగ్రిషోతో మేలు అగ్రిషో కిసాన్ 2024 ను ప్రారంభించిన మంత్రి తుమ్మల.



జైపూర్ లిటరేచర్ ఫెస్ట్ ప్రారంభం

 జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ తో రాజస్థాన్ పర్యాటకానికి గణనీయమైన మేలు జరగడమే కాకుండా నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ను ఆమె ప్రారంభించారు ముగ్గురు బుకర్ అయిదుగురు పులిజర్ విజేతలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుకకు వచ్చార.