1, ఫిబ్రవరి 2024, గురువారం

గ్రీన్ హౌస్ పై అవగాహన

 మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కేతి సంస్థ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని 60 మంది రైతులకు గ్రీన్ హౌస్ పై అవగాహన కల్పించారు గ్రీన్ హౌస్ వేసుకున్న తర్వాత ఏ ఏ పంటలు పండించాలో ఆ సంస్థ జోనల్ మేనేజర్ విటల్ రైతులకు అవగాహన కల్పించారు రక్ష 16 వేల రూపాయల విలువైన గ్రీన్ హౌస్ ను సబ్సిడీతో కేవలం 50 వేల రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో కామారెడ్డి ఏడిఏ అపర్ణ మాచారెడ్డి ఏవో రమ్యశ్రీ రైతులు శ్రీకాంత్ యూసుఫ్ రాములు లక్ష్మణ్ పాల్గొన్నారు



12న విద్యుత్ సమస్యల పరిష్కార సదస్సు

 రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీన మద్నూర్ మండలంలోని మెయిన్ రోడ్ గ్రామంలో ట్రాన్స్కో అధికారులతో సమావేశం నిర్వహించనున్నామని భారతీయ కిసాన్ సంగ్ బిచ్కుంద మండల అధ్యక్షుడు జంగం రాజకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు సమావేశంలో జిల్లా డివిజన్ స్థాయి విద్యుత్ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు



రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

 కామారెడ్డి పట్టణంలోని ఆర్కేడ్స్ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మధుప్రియ మనీష్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు