1, ఫిబ్రవరి 2024, గురువారం

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

 కామారెడ్డి పట్టణంలోని ఆర్కేడ్స్ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మధుప్రియ మనీష్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు




ఓపెన్ డిగ్రీ పీజీ అడ్మిషన్లకు గడువు పెంపు

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2023 24 డిగ్రీ పిజి అడ్మిషన్ల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ హిందూ తెలుగు ఉర్దూ ఎంకం ఎంఎస్సీ ఫిజియాలజీ మ్యాథమెటిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ నెల నాలుగో తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రంజిత లేదా ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఆరు ఒకటి రెండు నంబర్ను సంప్రదించాలని సూచించారు

Braouonline.in 

ఉపకార దరఖాస్తులకు మార్చి 31 వరకు అవకాశం

 పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది జనవరి 31 వ తేదీతో పకార దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కడువును మార్చి 31వ తేదీ వరకు పుడగిస్తూ అర్హులైన విద్యార్థులంతా వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ద్రువపత్రాల అప్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది వాస్తవానికి డిసెంబర్ 30వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండేది దీంతో జనవరి 31 వరకు గడువు పెంచారు అయినప్పటికీ విద్యార్థులు పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించకపోవడం కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కడుగు పొడిగింపు ప్రభుత్వానికి అనివార్యమైంది ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు 2023 24 విద్యా సంవత్సరంలో పోస్ట్మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి దరఖాస్తులు 12 లక్షల 65000 వస్తాయని అధికారులు అంచనా వేశారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను గతేడాది ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది డిసెంబర్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికాక పోవడం ఎన్నికల ప్రక్రియ విద్యార్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రల జారీలో జాతీయంగా జరగడంతో ప్రభుత్వం నెలపాటు కడుగును పొడిగించింది జనవరి 31వ తేదీ నాటికి కడువు పూర్తి కాక ప్రెషర్స్ కేటగిరిలో నాలుగు లక్షల ఇరవై,262 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కేటగిరీలో మరో ఒక లక్ష 30 వేల మంది దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది