1, ఫిబ్రవరి 2024, గురువారం

విద్యార్థులకు అభినందన సభ

 కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీలలో హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 16 మంది విద్యార్థులు పాల్గొని 24 మెడల్స్ సాధించడంతో బుధవారం అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోటగిరి ఎస్సై సందీప్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు స్వీయ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనాలని హైదరాబాదులో అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థి అందరినీ ప్రత్యేకంగా అభినందించారు కరాటే మాస్టర్లు పల్లవిని అభినందించారు వివేకానంద పాఠశాలకు ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ హనుమంతరావు శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు



రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థుల ఎంపిక

 యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగబోయే రెడ్డి పోటీలకు కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామ పరిధిలోని శాంతినికేతన్ విద్యాలయం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు రిషిక దివ్య అభిలాష్ రిషిత్ గౌడ్ ఈ నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి వ్యాయామ ఉపాధ్యాయులు రాజు శివాజీ అభినందించారు.



ఆరు విభాగాల్లో బంగారు వెండి పథకాలు

 తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుండి 30 వరకు బుద్వేల్ లో 30 డిగ్రీ కళాశాలలకు స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల నిజామాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన పాలకూర విద్యార్థులు సత్తా చాటారు మొత్తం ఆరు విభాగాల్లో బంగారు వెండి బహుమతులు కైవసం చేసుకున్నారు టెన్నికాయిట్లో బంగారు పథకం త్రిష ప్రియతమ టేబుల్ టెన్నిస్లో వెండి పథకం సాయి ప్రసన్న హై జంప్లో బంగారు పతకం రంజిత రిలే మీటర్ బంగారు పతకం 3000 మీటర్ 800 మీటర్ వెండి పతకం రోజా గెలుపొందారు గెలుపొందిన విద్యార్థినులకు వారికి శిక్షణను ఇచ్చిన పిఈటిలను ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయులు అభినందించారు