30, జనవరి 2024, మంగళవారం

క్రీడాకారిణులకు సన్మానం

 భిక్కనూరు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14 విభాగం జాతీయ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను జంగంపల్లి సర్పంచి నర్సింలు యాదవ్ సన్మానించారు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కల్పన మానస లను సన్మానించి అభినందించారు ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఎం జె పి ప్రిన్సిపల్ ప్రమోద వార్డు సభ్యుడు సంతోష్ ప్రదీప్ రమేష్ పాల్గొన్నారు.



రెండున వివేక స్ఫూర్తి జిల్లా స్థాయి పోటీలు

 స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం రోజున జిల్లా కేంద్రం శివాజీ నగర్ రామకృష్ణ విద్యానికేతన్ లో జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రథమ బహుమతి 5000 రూపాయలు ద్వితీయ బహుమతి మూడువేల రూపాయలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు ఆసక్తి గలవారు 9.2 9 0 4 4 9 3 8 9 నెంబర్లు సంప్రదించాలని తెలిపారు. నిజామాబాద్ ..


జాతీయ స్థాయికి ఎంపిక

 నిజామాబాద్ నగరంలోని విజయ్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆకాంక్ష మహిళా ఉషూ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కార్యదర్శి అమృతలత తెలిపారు మంగళవారం ఉపాధ్యాయ బృందం క్రీడాకారిణిని అభినందించారు కోయంబత్తూర్ లో ఈనెల 18 21 తేదీల్లో నిర్వహించిన సౌత్ జోన్ అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ లో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.