30, జనవరి 2024, మంగళవారం

మూడున జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

 బాన్సువాడలో వచ్చే నెల మూడున జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు ఈ విషయాన్ని తెలంగాణ సోషల్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసూన్ కుమార్ నూతిపల్లి బాలరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వారు ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి గల విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులు రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ కు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు ఇతర వివరాలకు 9 0 5 9 9 0 9 0 9 8, 9 4 9 0 5 1 11 5 3 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

విజేతలకు బహమతుల ప్రదానం

 ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 20వ తేదీల్లో నిర్వహించిన యువజన వారోత్సవాల క్రీడా పోటీల్లో విజేతలకు సోమవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త బహుమతులు అందజేశారు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కాబట్టి క్రికెట్ వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థి దశ నుంచే గెలుపోటములు అలవాటు చేస్తూ గెలిచినవారు మరింత ముందుకు వెళుతూ ఓడిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రేంజర్ల నరేష్ విభాగ్ సంఘటన కార్యదర్శి రాజు సాగర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ జిల్లా కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ గా కస్తూర్బా విద్యార్థులు

జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ గా కస్తూర్బా విద్యార్థులు గెలిచారని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వినోద తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలో అండర్ 12 కట్టర్స్ లో విభాగంలో మహేశ్వరి ఆర్ హర్షవర్ధీని జి రశ్మిత శృత కీర్తి శాలిని గోల్డ్ మెడల్ సాధించారు రెండవ విభాగంలో అండర్ 12 ఎస్ శివ నందిని జి అఖిల అండ్ దివ్యశ్రీ సిహెచ్ అశ్విత ఎస్ ఆరాధ్య వనస్విని సిల్వర్ మెడల్ సాధించారని శ్రీ రష్మిత యు వర్ష టి నందిని ఎస్ రూప వి శ్రీ నిత్య బ్రాంచ్ మెడల్ సాధించారు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్పును కేజీబీవీ పాఠశాలకు లభించడం పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు వీరిని తస్మో ఇండియా సిస్ సత్య శంకర్ సంతోష్ మాస్టర్ శ్రీకాంత్ టోర్నమెంట్ ఆర్గనైజర్




ముగిసిన వాలి బాల్ పోటీలు

 జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ట్రస్ట్ ఓపెన్ వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా బాగా రెడ్డి తనయుడు రాష్ట్ర భాజపా నాయకుడు జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి స్థానంలో గెలుపొందిన తాడ్వాయి జట్టుకు 30 వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన గుడి వెనక తండా జట్టుకు 20వేల రూపాయలు తృతీయ స్థానం కైవసం చేసుకున్న మోతె జట్టుకు పదివేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చారు ఈ పోటీలో మొత్తం 40 జట్లు తలపడ్డాయి భాజపా నాయకులు యువజన నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.