6, మార్చి 2022, ఆదివారం

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

దోమకొండ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 5 6 7 తేదీలలో శ్రీ మల్లికార్జున స్వామి  కల్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ ,
యాదవ సంఘం, దోమకొండ.






 

మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కంటి దవాఖనాల నెట్వర్క్ Dr అగర్వాల్ ఐ

హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ అ దవాఖానాల్లో మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల కొరకు 9619334129 నంబర్ పై సంప్రదించాలని సూచించారు.



12 న లోక్ అదాలత్

 ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ లు నిర్వహించనున్నారు. తెలంగాణలో లో హైకోర్టు జిల్లా కోర్టులు కింది కోర్టులు సైతం లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట

 రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ కేసులు ,జరిమానా విధింపు లకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకుని పరిష్కారం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా ఆయన తెలిపారు. కోర్టులు విచారణ చేపట్టని కేసులతో పాటు విచారణ పెండింగ్లో ఉన్న కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.