18, మార్చి 2024, సోమవారం

జుక్కల్ రాజేశ్వర ఆలయంలో పూజలు

 డోంగ్లి మండలంలోని ఎన్బూర గ్రామ శివారులోని రాజేశ్వర ఆలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు సోమవారం దర్శించుకున్నారు భక్తులు నిర్వహించిన పాల్గొన్నారు ఆయన వెంట నాయకులు పరమేష్ పటేల్ నాగనాథ్ పాటిల్ ,మాదాయప్ప స్వామి ఉన్నారు



ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడలమ్మ కళ్యాణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు అనంతరం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు మధ్యాహ్నం అన్నదానం చేశారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత ఉపాధి శిక్షణ

 సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్య కోర్సులలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ కోఆర్డినేటర్ సయ్యద్ ముజుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఎమ్మెస్ ఆఫీస్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ మెహందీ కోర్సులలో ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వీధిలో 50% రాయితీతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు కోర్సు అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని ఆసక్తి ఉన్న యువభతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు 7386180456 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు