15, మార్చి 2024, శుక్రవారం

ఘనంగా బీరప్ప పండుగ

 జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూర్ గ్రామ పొలిమేరలో ఉన్న బీరప్పలయంలో గురువారం బీరప్ప పండుగను కురుమ కులస్తులు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఖండేబల్లూరు గ్రామం నుండి కుటుంబ సమేతంగా ఊరేగింపుగా నైవేద్యాలు తీసుకువచ్చి ఆలయంలో బీరప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు బీరప్ప కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పండగ ఉత్సవాలలో శివరాజ్ దేశాయి బసవరాజు రెడ్డి కృష్ణ విట్టల్ కొండ మల్లుగొండ కండుగొండ మారుతి కొండ పండరి సార్ మాణిక్ గొండ తదితరులు పాల్గొన్నారు



మహా పాదయాత్రకు ఆర్థిక సహాయం

 మహా పాదయాత్ర సందర్భంగా జిల్లా జంగమ సమాజం అధ్యక్షుడు ప్రభాకర్ స్వామి ఆర్థిక సహాయం అందజేశారు జై మహదేవ్ శ్రీశ్రీశ్రీ రేణుక ఆచార్య పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా జంగమ సమాజం అధ్యక్షుడు ప్రభాకర్ స్వామి తనవంతుగా 1216 రూపాయలు విరాళంగా అందజేశారు ఆయన పాదయాత్రను జంగమ సమాజం ప్రతినిధులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు జిల్లాలో స్వామీజీ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు లోక కళ్యాణార్థం ఆయన పాదయాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు



16 నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవాలు

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు 16న శనివారం సాయంత్రం 5 గంటలకు గంగ బోనం 17న ఆదివారం రాత్రి మందగంపలతో ఊరేగింపు 18 సోమవారం శ్రీ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడాలమ్మల కళ్యాణం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో నేతలు నాగరాజు యాదవ్ కట్ట లక్ష్మణ్ యాదవ్ సిరబోయిన ప్రవీణ్ యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ ఎల్లయ్య యాదవ్ రమేష్ యాదవ్ లింగం యాదవ్ పరశురామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు