3, మార్చి 2024, ఆదివారం

కాపురంలో చీర చిచ్చు

 నాకు నచ్చిన చీరలే నా భార్య కట్టుకోవాలని ఆ భర్త పంతం నాకు కూడా నచ్చాలి కదా నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాను అనేది భార్య ప్రశ్న ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది విడాకుల దాకా వెళ్ళింది ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి హత్రాస్కు చెందిన యువతితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. పెండ్లైన తర్వాత భార్య కోసం దీపక్ చాలా చీరలు కొని తెచ్చాడు అయితే ఈ చీరలు ఆమెకు నచ్చలేదు కానీ దీపక్ మాత్రం ఇవే చర్యలు కట్టుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు నాకు నచ్చని చీరలు నేనెందుకు కట్టుకుంటా అని భార్య మొండికేసింది దీనితో ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి వీరు కుటుంబాల పెద్దలు కలగజేసుకొని నచ్చచెప్పిన లాభం లేకపోయింది పైగా పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది దీనితో భార్యాభర్తలిద్దరిని కౌన్సెలింగ్కు తీసుకెళ్లారు అయినా వీరి మధ్య గొడవలు సద్దుమనగలు దేనితో దంపతులిద్దరూ విడాకులు కోరుతూ ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానున్నది

ఆకట్టుకుంటున్న ఎల్లమ్మ నాటకం

 గాంధారి మండలంలోని కరక్వాడి గ్రామంలో శుక్రవారం నుండి రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని భాగవతాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇటీవల రేణుక ఎల్లమ్మ నాటకాన్ని నేర్చుకున్నారు దానిని గ్రామంలో ప్రదర్శించడంతో ప్రజల ఆసక్తిగా తిలకిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు



సామూహిక సత్యనారాయణ వ్రతాలు

 నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో హైవేపై ఉన్న అంజనాద్రి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులకు కన్నదానం చేశారు కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులతో పాటు అంజనాద్రి ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు