2, మార్చి 2024, శనివారం

బీసీ స్టడీ సర్కిల్ గ్రూపు వన్ ఉచిత శిక్షణ

 బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టిఎస్పిఎస్సి గ్రూప్ వానికి ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఇందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఈనెల 7 లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు డైరెక్టర్ వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తులను జిల్లా కేంద్ర కార్యాలయంలో నేరుగా ఇవ్వాలని అన్నారు 10 ఇంటర్ డిగ్రీ ధృవపత్రాలతో పాటు కుల ఆదాయపత్రాలు గ్రూపు వన్ దరఖాస్తు ఆధార్ కార్డుతో పాటు రెండు పీపి ఫోటోలు జతచేయాలని సూచించారు వివరాలకు 8639002255 నెంబర్ కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు

 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేటలో 2024 25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని కామారెడ్డి ఇన్చార్జి జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారిని రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ ఐదు సీట్లు ఇతర షెడ్యూల్డ్ తెగల వారికి ఒక సీటు భర్తీకి ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు

బైక్ ట్రాలీ అదిరింది..

 ఇప్పటివరకు ఆటో ట్రాక్టర్ ట్రాలీలు చూశాము కానీ ఇప్పుడు ద్విచక్ర వాహన ట్రాలీలు వస్తున్నాయి పొలం పనులకు యూరియా బస్తాలు ఇంటి దగ్గర ఉన్న పశువులకు గడ్డి తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్నాయి నిజామాబాద్ శివారు కాలూర్లో రాహుల్ అనే యువకుడు తన బైకు అనుసంధా నించి గడ్డిని తరలిస్తుండగా తీసిన ఫోటో ఇది ఈ ట్రాలీ తయారు చేయించుకోవడానికి 30 వేల రూపాయలు ఖర్చు అయిందని రాహుల్ చెప్పారు