2, మార్చి 2024, శనివారం

డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్య నూతన కార్యవర్గం 2024

 


తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాదులో ఏర్పాటు అయింది 

అధ్యక్షునిగా.. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

 కార్యనిర్వాహక అధ్యక్షులుగా ..శ్రీధర్ రావు ,పరమేష్

 ఉపాధ్యక్షులుగా ..నారాయణ గౌడ్, రవీంద్రనాథ్

 ప్రధాన కార్యదర్శిగా ..యాద రామకృష్ణ 

కోశాధికారిగా ..శంకర్ 

కార్యనిర్వాహక కార్యదర్శిగా ..భాస్కర్ రెడ్డి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పూర్వ అధ్యక్షులు ప్రకాష్ గింజల రమణారెడ్డి సుందర్ రాజ్ కార్యదర్శులు హరిస్మరణ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు

జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం

 మహాత్మ జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన బిసి అభ్యర్థులు ఈనెల ఐదు నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి ఒక ప్రకటనలో తెలిపారు

దరఖాస్తుల గడువు పొడిగింపు

 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ దేశాల్లోని విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారు ఈనెల 31 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు