29, ఫిబ్రవరి 2024, గురువారం

స్టార్టప్ ఆవిష్కరణలు భేష్

 దూరం నుంచే గుండెలయ వినొచ్చు. చిన్న లైట్ తో ఇఎన్టి సమస్యలు తెలుసుకునే వీలు ఫిజియోథెరపీ అంచనాకు ఉపయోగపడే ఫిజి డివైస్ శరీరం మనసు సమన్వయాన్ని గుర్తించే యంత్రాలు బయో ఆసియా 2024 లో ఆకట్టుకున్న ఆవిష్కరణలు

రెండు రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సు బుధవారం ముగిసింది ఇందులో భాగంగా నిర్వహించిన ట్రేడ్ ఎక్స్పోలో పలు స్టార్టప్ లు ప్రదర్శించిన ఉత్పత్తులు నూతన ఆవిష్కరణలు అందరినీ ఆకటకున్నాయి వాటిలో కొన్ని


రిమోట్ స్టెతస్కోప్

రోగి హృదయ స్పందనలు డాక్టర్ వినాలంటే ఇద్దరు పక్కపక్కనే ఉండాలి అలా కాకుండా అమీర్పేటలో ఉన్న పేషెంట్ గుండెలైన ఎక్కడో అమెరికాలో ఉన్న డాక్టర్ వినే వీలు కల్పించే స్టెతస్కోపును ఆబో అనే సంస్థ తయారు చేసింది దాని పేరు ఆబో వన్ ఇది పేషెంట్ల గుండెలైన రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేయగలరని రియల్ టైం లోను వినిపించగలరని ఆబో ప్రతినిధులు పేర్కొన్నారు ఈ స్మార్ట్ స్టెత్ ధర 16,500 చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే పేషంట్ల సమస్యను డాక్టర్ ఎక్కడి నుంచి అయినా పర్యవేక్షించడానికి వీలు కల్పించే ఆబోస్కోప్ ను సైతం ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది దీని ధర 9900 అలాగే ఆబో ఎక్స్ సిక్స్ అనే పరికరంతో ఆరు రకాల వైటల్స్ ను ఆబోరింగ్తో నిద్ర ఒత్తిడిని ట్రాక్ చేయడం సాధ్యమవుతుందని ఆబు ప్రతినిధులు చెబుతున్నారు స్లీప్ అప్నియా తదితర సమస్యలున్న వారికి ఉపయోగపడే ఆబోరింగ్ ధర 15 వేల నుంచి 18 వేల రూపాయలు కాక ఆబో ఎక్స్ సిక్స్ ధర 18,900


ఫిజి యోథెరపీ అసెస్మెంట్ కు ఫిజీ

ఫిజియోథెరపీకి ఇటీవల కాలంలో ప్రాముఖ్యం బాగా పెరిగింది ఈ నేపథ్యంలో ఏ తరహా సమస్యకు ఏ తరహా తెరపి అయితే సరిపోతుందో తెలిపే ఫిజి అనే డివైస్ ను స్టార్టోన్ ల్యాబ్స్ తయారు చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫిజియోథెరపీ టూల్ కిట్ ఇది మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ తో దీనిని కనెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నివేదికలను పొందవచ్చు న్యూరోలాజికల్ వెన్నెముక సమస్యల బాధితులకు ఆటలాడుతూ గాయాల పాలైన వారికి పెద్ద వయసులో వచ్చే సమస్యలకు ఇది బాగా తోడ్పడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు

ఏకాగ్రతను కొలుస్తుంది ఏ పని చేయడానికి అయినా ఏకాగ్రత ముఖ్యం కానీ ఆ ఏకాగ్రతను సాధించడమే కష్టం. శరీరానికి మనసుకు మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణం రూపొందించిన సిసిటిఏ కాన్సన్ట్రేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ టు శరీరానికి మనసుకు మధ్య సమన్వయం కల్పించడంలో తోడ్పడుతుందని కోయక్సిన్ టెక్నాలజీ సంస్థ చెబుతోంది బాధపడే వారికి లర్నింగ్ డిజేబులిటీ ఆర్టిజం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు దీనితో వ్యక్తులలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏకాగ్రత మెరుగుపడుతుందని మెదడుకు చేతికి సమన్వయం బ్రెయిన్ హ్యాండ్ కూడా పెరుగుతుందని చెప్పారు






అక్షయపాత్ర సేవలు అమోఘము

 అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ ఆ లోపాన్ని తొలగిస్తుందని అభినందించారు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభావేక్షలని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు తనవంతుగా అక్షయపాత్రకు ఎన్ని రమణ 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు యంత్రాలను ప్రారంభించారు కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస హైదరాబాద్ ట్ర స్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు

పులగం ఎలా చేయాలి

 బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత

బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది