పదిమంది మహిళలలో ఒకరు ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడుతున్నారని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ పేర్కొన్నది ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటినుండి వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ బింద్ర తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు సెషన్ల వారీగా వ్యాధి లక్షణాలు గుర్తించడం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు రోబోటిక్ సర్జరీలు తదితర అంశాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో దవాఖాన బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు వర్క్ షాప్ చివరి రోజు మార్చి మూడున నెక్లెస్ రోడ్డులో ఉదయం ఆరు గంటలకు ఎల్లో రిబ్బన్ రన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు డ్రోన్ ద్వారా వారి మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలలో వస్తున్న ఆకుపచ్చ పురుగు ఆకుమూడత పేను బంక తదితర తెగుళ్లను నివారించడానికి డ్రోన్ ద్వారా మందులను పిచికారి చేయించడానికి ఎకరాకు 600 అవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రంజిత్ భూపతి అవగాహన కల్పించారు జంగంపల్లి గ్రామ రైతులు శశికాంత్ నర్సింహులు శ్రీనివాస్ భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయ 60వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆవరణలో సాయంత్రం ఘనంగా చక్రతీర్థం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సీతారాం మధు సంతోష్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి అరవైవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం రేణుక ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఘనంగా చక్కెర తీర్థం జాతర జరిగింది రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగరాయపల్లి అంజయ్య శిష్యుల బృందం శ్రీ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ నాని ప్రభాకర్ రెడ్డి ఆశ పోయిన శ్రీనివాస్ కదిరి గోపాల్ రెడ్డి సీతారాం మధు సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్ సభ్యులు చిన్న పోష గౌడ్ స్వామి గౌడ్ భక్తులు పాల్గొన్నారు
