29, ఫిబ్రవరి 2024, గురువారం

జానపద కళాకారుల మండల కమిటీ ఎన్నిక

 లింగంపేట మండల జానపద కళాకారుల కమిటీని ఎన్నికలు బుధవారం నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రాజయ్య జిల్లా అధ్యక్షుడు ఉప్పల విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాజులు ఉపాధ్యక్షులుగా పెంటయ్య కాశీరాం తమ్మిరాజు ప్రధాన కార్యదర్శిగా సాయిలు కోశాధికారిగా పెంటయ్యలను ఎన్నుకున్నారు.

డెస్క్ తుడవండి

 అలా ఆఫీసులోకి అడుగు పెట్టామో లేదో బోలెడు పని ఎదురు చూస్తూ ఉంటుంది దేనికి తోడు డెస్క్ పై పేర్కొన్న ఫైల్స్ పేపర్లు మరింత ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి అదనపు శ్రమ నా పని కాదని అనుకోకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోండి ఉత్పాదకత కూడా పెరుగుతుంది

సిస్టం శుభ్రత క్లీనింగ్ డిపార్ట్మెంట్ ది అనేసుకుంటాం మనము కానీ పని మధ్యలో వేళ్లను చూసుకుంటే మురికిగా కనిపిస్తే ఏమనిపిస్తుంది పొరపాటున ముఖం మీద పెట్టుకున్నానా అనుకోవడం దానిమీదనే దృష్టి మరలడం లాంటివి జరుగుతుంటాయి కదూ అలా కాకుండా టిష్యూ లేదా చిన్న వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటే మధ్యలో తుడిస్తే సరి దృష్టి పడలేదు

చాలా గుర్తుగా పెట్టాం అనుకుంటామా తీరా అవసరానికి డ్రాలోని వస్తువులన్నీ ఎన్నిసార్లు తిరగేసినా కావలసిన ఫైల్ దొరకదు ఆందోళన కమ్మేస్తుంది ఇలా జరగదు అంటే ఫలానా రోజు ఫలానాది అవసరం అనుకుంటూ ఒక వరుస క్రమంలో పెట్టుకోండి స్టాప్లర్ పెన్సిల్ పిన్నులు వంటి వాటిని ఒకచోట రిఫరెన్స్ మెటీరియల్ లను మరొకచోట ఇలా సర్దుకోండి ఎంత తొందరలో ఉన్న వాటిని అక్కడే పెట్టేలా అలవాటు చేసుకుంటే సరి

కొవ్వుతో మెదడు పైన దుష్ప్రభావము

 పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడు పైన గ్రహణ శక్తి పైన దుష్ప్రభావం చూపుతుంది ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకు ఎక్కువ ముఖ్యంగా కుటుంబంలో అల్జీమర్స్ వ్యాధి ఉన్న పురుషులకు ఈ కొవ్వ వల్ల నష్టం అధికంగా ఉంటుంది కాలేయం ఉదరము క్లోమగ్రంధి చుట్టూ కొవ్వు పేరుకు పోతే అది మెదడు పరిమాణం కుషించుకుపోవడానికి కారణమవుతుంది అల్జీమర్స్ వ్యాధి వల్ల చిత్తభ్రంశం చెందిన వారి సంతానాన్ని పరిశీలించగా ఈ సంగతి తేలింది వారంతా ఆరోగ్యంగా ఉన్న నడి వయసు పురుషులే వారి పొత్తికడుపులోని కొవ్వును ఎమ్మారై ద్వారా పరీక్షించారు