29, ఫిబ్రవరి 2024, గురువారం

డెస్క్ తుడవండి

 అలా ఆఫీసులోకి అడుగు పెట్టామో లేదో బోలెడు పని ఎదురు చూస్తూ ఉంటుంది దేనికి తోడు డెస్క్ పై పేర్కొన్న ఫైల్స్ పేపర్లు మరింత ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి అదనపు శ్రమ నా పని కాదని అనుకోకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోండి ఉత్పాదకత కూడా పెరుగుతుంది

సిస్టం శుభ్రత క్లీనింగ్ డిపార్ట్మెంట్ ది అనేసుకుంటాం మనము కానీ పని మధ్యలో వేళ్లను చూసుకుంటే మురికిగా కనిపిస్తే ఏమనిపిస్తుంది పొరపాటున ముఖం మీద పెట్టుకున్నానా అనుకోవడం దానిమీదనే దృష్టి మరలడం లాంటివి జరుగుతుంటాయి కదూ అలా కాకుండా టిష్యూ లేదా చిన్న వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటే మధ్యలో తుడిస్తే సరి దృష్టి పడలేదు

చాలా గుర్తుగా పెట్టాం అనుకుంటామా తీరా అవసరానికి డ్రాలోని వస్తువులన్నీ ఎన్నిసార్లు తిరగేసినా కావలసిన ఫైల్ దొరకదు ఆందోళన కమ్మేస్తుంది ఇలా జరగదు అంటే ఫలానా రోజు ఫలానాది అవసరం అనుకుంటూ ఒక వరుస క్రమంలో పెట్టుకోండి స్టాప్లర్ పెన్సిల్ పిన్నులు వంటి వాటిని ఒకచోట రిఫరెన్స్ మెటీరియల్ లను మరొకచోట ఇలా సర్దుకోండి ఎంత తొందరలో ఉన్న వాటిని అక్కడే పెట్టేలా అలవాటు చేసుకుంటే సరి

కొవ్వుతో మెదడు పైన దుష్ప్రభావము

 పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడు పైన గ్రహణ శక్తి పైన దుష్ప్రభావం చూపుతుంది ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకు ఎక్కువ ముఖ్యంగా కుటుంబంలో అల్జీమర్స్ వ్యాధి ఉన్న పురుషులకు ఈ కొవ్వ వల్ల నష్టం అధికంగా ఉంటుంది కాలేయం ఉదరము క్లోమగ్రంధి చుట్టూ కొవ్వు పేరుకు పోతే అది మెదడు పరిమాణం కుషించుకుపోవడానికి కారణమవుతుంది అల్జీమర్స్ వ్యాధి వల్ల చిత్తభ్రంశం చెందిన వారి సంతానాన్ని పరిశీలించగా ఈ సంగతి తేలింది వారంతా ఆరోగ్యంగా ఉన్న నడి వయసు పురుషులే వారి పొత్తికడుపులోని కొవ్వును ఎమ్మారై ద్వారా పరీక్షించారు

భారతీయుల ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్

 తీవ్రస్థాయి కోవిడ్ బారిన పడిన భారతీయులలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నదని తాజా అధ్యయనం తెలిసింది దాదాపు సగం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వెలడైనది. ఇది నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుంది వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నిపుణులు ఈ పరిశోధన చేశారు ఇందులో భాగంగా 27 మందిని పరిశీలించారు వారిలో గణనీయ స్థాయిలో దెబ్బతిన్నాయని గుర్తించారు వ్యాయామ సామర్థ్యం జీవన నాణ్యత కూడా తగ్గిపోయిందని తీర్చారు తీవ్రస్థాయి కోవిడ్ నుంచి కోరుకున్న రెండు నెలల తర్వాత కూడా 49.3% మందికి శ్వాసలో ఇబ్బంది 27.1% మందిలో దగ్గు వంటివి కనిపించాయి ఇతర దేశాల డేటాతో పోల్చినప్పుడు భారతీయులలోని ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు దీనికి నిర్దిష్ట కారణాలు బోధపడటం లేదని పరిశోధకులు తెలిపారు అయితే భారతీయులలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండొచ్చని చెప్పారు ఇక్కడ తీవ్ర కోవిడ్ బారిన పడిన వారిలో 72.5% మందిలో మధుమేహం అధిక రక్తపోటు దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి ఉన్నట్లు తెలిపారు రక్త ప్రవాహంలోకి వాయువును చేరవేసే ఉపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిన్నదని పరీక్షల్లో వెళ్లడైనట్లు వివరించారు దేశంలో క్షయ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉండడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు