27, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఆలయంలో ప్రత్యేక పూజలు

 ఉప్పల్వాయి గ్రామంలోని వనదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామిని రకరకాల పూలతో అలంకరించి అనంతరం పండితుల అభిషేకాలు అర్చనలు చేశారు పండితులు రాజమౌళి శంకర్ గంగాధర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



భానుడి కిరణ కృత్యం సహ్యాద్రి వరుణ విచిత్రం

 ఆస్వాదించాలి కానీ ప్రకృతిలో ఇమిడి ఉన్న అందాలు ఎన్నో కొన్ని సహజసిద్ధంగా అలరిస్తే మరి కొన్ని సమయాలు గుణంగా ఆకర్షిస్తాయి రహదారి నిర్మాణం కోసం తొలిచిన కొండ రెండుగా చీలగా ఉదయం తూర్పు నుంచి ప్రసరించిన సూర్యకిరణాలు పడమర కొండపై పడి ఆ భాగమంతా లేత ఎరుపు రంగులో కనిపిస్తూ ఆకట్టుకుంది తూర్పు భాగం మాత్రం సహజంగా మట్టి రంగులు కనిపించింది ఇలా రెండుగా చీలిన ఒకే కొండ వేరువేరు రంగులలో కనిపించేసరికి ఈ దారి గుండా వెళ్లేవారు అలాగే చూసి ఇది సూర్యకిరణాల మాయ అని తెలుసుకొని ఆశ్చర్య చేతులయ్యారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలాల సరిహద్దులో ఉన్న సహ్యాద్రి పర్వతాల నడుమ సోమవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైనది

కేరళలో ఘనంగా రోడ్డుకు పెళ్లి

 రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడులోని కొడియాతుర్ గ్రామస్తులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు బిరియాని స్వీట్లు వడ్డించారు రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు వరుడు రోడ్డు ఎవరు అని అడిగారు సుమా అక్కడ అలాంటివి ఏమీ ఉండవు కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు 1200 మీటర్ల పొడవు మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది దీనిని 1980లో నిర్మించారు అనంతరం ఆ గ్రామ జనాభా మూడు రెట్లు పెరిగింది వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నారు అయినా కొన్ని కారణాలవల్ల కుదరడం లేదు ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు వారికి పరిహారం రహదారి నిర్మాణానికి 60 లక్షల రూపాయలు అవుతాయని అంచనా వేశారు ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు గ్రామానికి చెందిన 15 మంది ముందుకు వచ్చి ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున 15 లక్షల రూపాయల విరాళాలు అందించారు ఇంకా వారికి 45 లక్షల రూపాయల అవసరం అప్పుడే వారికి పనం పయట్టు లేదా కురి కళ్యాణం గుర్తుకొచ్చింది ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నీతులు సమీకరిస్తారు ఇప్పుడు కొడియాతూరు గ్రామస్తులు సైతం నిధుల కోసం పనం పయట్టు కింద రహదారికి పెళ్లి చేశారు