27, ఫిబ్రవరి 2024, మంగళవారం

అక్షరాలలో ఫోన్ సంభాషణలు

 ట్రూ కాలర్ సరికొత్త ఫీచర్

కాలర్ వివరాలను తెలిపే యాప్ ట్రూ కాలర్ తాజాగా సంచలన ఫీచర్ను జోడించింది ప్రీమియం కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్ను జత చేసింది ఇది కాల్ రికార్డింగ్ తో పాటు మాట్లాడిన మాటలను అక్షర రూపం చేస్తుంది ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ భాషలకు ఈ టీచర్ పరిమితం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వివరాలతో కూడిన సమ్మరీ కూడా ప్రత్యక్షం అవుతుంది.

26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు


ఎఫ్ పీ ఐ ల పేరుతో మోసపు ట్రేడింగ్ స్కీములు

 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులము అంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబి హెచ్చరించింది సెబీ రిజిస్టర్డ్ ఎఫ్ బి ఐ సంబంధితమైన అంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాములపై తమకు పాల ఫిర్యాదులు అందాయని అవి విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్ల సభ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సబి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు సెమినార్లు స్టాక్ మార్కెట్లో మెంటార్స్ ప్రోగ్రాములు అందిస్తామంటూ వాట్సాప్ లైవ్ బ్రాడ్కాస్టర్తో ప్రచారం చేసి అమాయక ఇంస్టార్లకు వల వేస్తున్నట్లు వివరించింది అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్ డిమార్ట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని షేర్లు కొనుగోలు ఐపిఓలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామని అంటున్నారని సెబి తెలిపింది ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ల ద్వారా నిర్వహిస్తున్నారని అన్నది దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ బి ఐ లకు ఏ సరళీకరణలు లేవన్నది.