26, ఫిబ్రవరి 2024, సోమవారం

నిద్రకు ముందు

 నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు శరీరానికి మనసుకు రీఛార్జ్ టైం తగినంత నిద్ర లేకపోయినా ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా మానసిక శారీరక సమస్యలు తప్పవు అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు అది ఏమిటంటే

గురువెచ్చటి పాలు ..అనాదిగా పెద్దలు చేస్తున్న సూచన ఇది ఎందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు పాలలోని ట్రిప్ట్ ఆఫ్ పాన్ అనే రసాయనం నిద్రను మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిని హార్మోన్లను ప్రేరేపిస్తుంది నిద్రను ఆహ్వానిస్తుంది

చామంతి టీ.  ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయ మీది ఇందులోని ఏపీ జెన్యూన్ అనే రసాయనం మెదడు సేద తీరేలా చేస్తుంది దాంతో ఒత్తిడి తగ్గి నిద్ర పట్టేస్తుంది

వలేరియాన్ టీ.. ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్ కు మత్తెక్కించే లక్షణం ఉంది నిద్రలేమి నీ ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది

కషాయాలు.. లావెండర్ నిమ్మ కృష్ణ కమలం లాంటి ఔషధ మొక్కలతో రూపొందించిన కషాయాలు కూడా నిద్రకు మేలు చేస్తాయి.

ఇక ఖచ్చితమైన గర్భధారణ వయసు

 గర్భిణీలో పెరుగుతున్న పిండం ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధా మోడల్ ను అభివృద్ధి చేశారు గర్భిణీ విషయంలో సరైన సంరక్షణ ఖచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయసు అవసరము శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ను గర్భిణీ జిఏ 2 గా పిలుస్తున్నారు ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా గర్భిణీ జిఏ 2 ను అభివృద్ధి చేశారు ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితమైన గర్భధారణ వయసును అంచనాగిస్తుంది అంతేకాదు గతంలో తలెత్తిన దోషాలను మూడు రెట్లు తగ్గిస్తుంది

మోమోలు తేలేదని భర్త పై కేసు

 ఎవరైనా భర్త తనను మంచిగా చూసుకోవడం లేదను హింసిస్తున్నాడని ఫిర్యాదు చేస్తారు కానీ ఆగ్రాకు చెందిన ఒక వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వడం లేదని పోలీసు కేసు పెట్టింది మోమో అనేది మన సమోసాలు లాగా పాపులర్ స్నాక్ యూపీలోని మలుపురకు చెందిన ఒక మహిళకు పినహాటకు చెందిన ఒక వ్యక్తితో ఇటీవల వివాహమైంది పెళ్లి సమయంలో తనకు మోమోస్ అంటే ఇష్టం అని వధువు చెప్పిందట పెండ్లయ్యాక ఆమె భర్త క్రమం తప్పకుండా మోమోస్ తెచ్చేవాడని ఇటీవల అలా చేయడం లేదని ఆమె అలిగిందట ఈ విషయమే తరచూ వారిద్దరి మధ్య గొడవ జరిగేది ఒకరోజు అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయిందట అక్కడి నుంచే భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు భార్యాభర్తలను కౌన్సెలింగ్కు పంపించారు కొన్నిసార్లు డ్యూటీ ఆలస్యం వల్ల మామూలు దొరకలేదని మరికొన్నిసార్లు మోమోస్ తీసుకోవడం మర్చిపోయానని భర్త తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఇద్దరి మధ్య కౌన్సిలర్లు కుదిరించిన రాజీప్రకారం భర్త వారానికి రెండు రోజులు మోమోసు తీసుకురావాలి. ఎందుకు అంగీకరించిన మహిళ భర్తతో కాపురానికి వెళ్లిందట